ఈరోజు విడుదల అయిన ‘సుప్రీమ్’ సినిమాను ప్రమోట్ చేస్తూ దర్శకుడు అనీల్ రావిపూడి అనేక ఆ శక్తికర విషయాలను బయట పెట్టాడు. తాను నందమూరి బాలకృష్ణతో ‘రామారావు గారు’ అనే టైటిల్ తో సినిమాను చేయడం ఖాయం అని ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లైన్ బాలకృష్ణకు వినిపించానని ఆ లైన్ బాలయ్యకు బాగా నచ్చడంతో ఆ కథను డెవలప్ చేయమని బాలకృష్ణ చెప్పినా తాను ‘సుప్రీమ్’ బిజీలో ఉండటంతో చేయలేక పోయానని అయితే ఈ కథ బాలకృష్ణ కోసమే వ్రాసాను అంటున్నాడు ఈ యువ దర్శకుడు.

తాను తీసే సినిమాలలో కామెడీ సన్నివేసాలు బాగ్ రావడానికి స్ఫూర్తి తాను చిన్నతనంలో  చూసిన జంధ్యాల సినిమాలు అని అంటూ జంధ్యాల మార్క్ కామెడీతో సినిమాలు తీయడం తనకు ఇష్టం అని అంటున్నాడు అనీల్ రావిపూడి. తనకు చిరంజీవి డాన్స్ లు పాటలు అంటే విపరీతమిన ఇష్టం అని చెపుతూ ఆ ఇష్టంతోనే చిరంజీవి పాట ‘అందం హిందూళం’ పాటను సాయి ధరమ్ తేజతో రీమిక్స్ చేయించాను అని అంటున్నాడు ఈ ‘పటాస్’ డైరెక్టర్.

రామాయణంలో శ్రీరాముడు కోసం హన్మంతుడు వాయు వేగంతో లంకకు వెళ్ళినట్లుగా తన ‘సుప్రీమ్’ సినిమాలో కథ రీత్యా ఒకరి కోసం సాయి ధరమ్ తేజ్ ట్యాక్సీ డ్రైవర్ గా పరుగులు తీస్తాడని అయితే ఆ వ్యక్తి ఎవరూ అన్నది సస్పెన్స్ అని అంటున్నాడు. ఈకథ ఏ భాషకైనా సరిపోతుంది అని అనీల్ రావిపూడి చెప్పడం బట్టి ఈసినిమాను వేరే భాషలలో కూడ రీమేక్ చేసే సంకేతాలను ఇస్తున్నాడు ఈ దర్శకుడు. 

ఈ రోజు విడుదలైన ‘సుప్రీమ్’ కు మొదటి రోజు మొదటి షో నుండి పాజిటివ్ టాక్ రావడంతో త్వరలోనే అనీల్ రావిపూడి బాలకృష్ణతో తీయాలి అనుకున్న ‘రామారావు గారు’ సెట్స్ పైకి వచ్చే అవకాసం ఉంది. అన్నీ కుదిరితే బాలకృష్ణ 101వ సినిమాగా ఈ ‘రామారావు గారు’ రూపొందినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: