మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు వారి అబ్బాయి స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన  ‘సరైనోడు’ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నారు. ఏది ఏమైనా బన్ని మాత్రం  ‘సరైనోడు’ చిత్రంతో  నాలుగోసారి 50 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయాడు. సరైనోడు చిత్రం విడుదలైనపుడు ఈ చిత్రంపై మిశ్రమ స్పందన రావడం చిత్రంలో విపరీతమైన వైలెన్స్ ఉందని ప్రచారం జరిగింది.

సరైనోడు పోస్టర్


అంతే కాదు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోతుందని అంతా భావించారు. కానీ మెల్లి మెల్లిగా ఈ చిత్రంపై అభిప్రాయం మరోలా మారిపోయింది..రిజల్ట్ అందుకు భిన్నంగా వస్తుండడంతో నిర్మాతతోపాటు డిస్ట్రిబ్యూటర్లు తెగ ఆనందంలో మునిగిపోతున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి భారీ సినిమాలు ఏవీ పోటీకి లేకపోవడంతో ఒక్క నైజాంలోనే పదిరోజుల్లో రూ.13.97 కోట్లు కలెక్షన్స్ దుమ్ము లేపింది.

సరైనోడు లో అల్లు అర్జున్


సరైనోడు చిత్రం ఏరియావైజ్ కలెక్షన్లు : 


నైజంలో                   -   17. 25 కోట్లు 


సీడెడ్ లో                 -   9. 97 కోట్లు 


వైజాగ్ లో                -  6. 75 కోట్లు 


ఈస్ట్ లో                   -  4. 53 కోట్లు 


వెస్ట్ లో                    -  3. 92 కోట్లు 


కృష్ణా లో                  -   3. 60 కోట్లు 


గుంటూరు లో           -   4. 82 కోట్లు


నెల్లూర్ లో               -   2. 09 కోట్లు 


రెస్ట్ ఆఫ్ ఇండియా   -    1.35 కోట్లు


కర్ణాటక                   -  6.30 కోట్లు 


ఓవర్సీస్                 -  4.00 కోట్లు  


మొత్తం                  -  64.48 కోట్లు 


మరింత సమాచారం తెలుసుకోండి: