తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ సినిమాకు రాని కీర్తి ప్రతిష్టలు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రానికి వచ్చింది. గత సంవత్సరం రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగించింది. తెలుగు ఇండస్ట్రీలో  'బాహుబలి' గర్వపడే సినిమాగా నిలిచింది. అంతే కాదు ఫ్యూజువల్ ఎఫెక్ట్స్ తో  హాలీవుడ్ స్థాయిలో ఒక తెలుగు సినిమా రావడం ఇదే తొలిసారి దీంతో 'బాహుబలి-దిబిగినింగ్' చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. అంతే కాదు భారతదేశ జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా గెలుచుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ బాహుబలి 2 రాబోతున్న విషయం తెలిసిందే..అయితే ఈ చిత్రం ఏ చిన్న పాత్ర ఉన్న నటించడానికి చాలా మంది ఉత్సాహ పడుతున్నారు.

ఈ తరుణంలో బాహుబలి పార్ట్ 2లో యంగ్ టైగర్ ఎన్టీఆర్  జయదేవ్ రానా గా  కనిపించానున్నాడని  గత రెండు మూడు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు తెలుగులో ఎన్టీఆర్ జయదేవ్ గా నటిస్తే , తమిళ ,హిందీ భాషలలో మాత్రం జయదేవ్ రానా పాత్రలో తమిళ స్టార్ హీరో సూర్య నటించనున్నట్లు వార్తలు వచ్చాయి.  ఇండస్ట్రీలో రాజమౌళి, ఎన్టీఆర్ చాలా క్లోజ్. దీంతో బాహుబలి-2లో ఎన్టీఆర్ నటిస్తున్నాడనే విషయం నిజమే అనుకున్నారు.

బాహుబలి పోస్టర్


తాజాగా ఈ విషయాన్నీ యూనిట్ వర్గాలు అలాంటి ఏమీలేదని తేల్చి పడేశారు చిత్ర యూనిట్.  ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇక సూర్య కూడా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్  సింగం 3 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.దీంతో ఎన్టీఆర్ సూర్య లు బాహుబలి లో నటించనున్నట్లు  వస్తున్నవి గాలి వార్తలే నని తేలిపోయాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: