సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సినిమాకు అంతా సిద్ధమైనా హీరోయిన్ కన్ ఫ్యూజన్ మాత్రం ఇంకా తెర పడినట్టు లేదు. ప్రస్తుతం బ్రహ్మోత్సవం కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న మహేష్ తర్వాత చేయనున్న మురుగదాస్ సినిమా మీద ఫోకస్ పెట్టనున్నాడు. అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాకపోవడం విశేషం.


మహేష్ పక్కన శ్రీమంతుడులో జతకట్టిన శృతి హాసన్ మరళ మురుగదాస్ సినిమాలో అవకాశం కొట్టేసింది అని టాక్ వచ్చినా ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది. ఇక తాజాగా మహేష్ కు జతగా బాలీవుడ్ భట్ బ్యూటీ అలియాను అడుగుతున్నారట. సౌత్ సినిమాల మోజులో ఉన్న బాలీవుడ్ భామలు ఇక్కడ స్టార్ హీరోల ఆఫర్లు రాగానే ఎగిరిగంతులేస్తున్నారు. 


మహేష్ విషయంలో కూడా అంతే.. అయితే మొన్నటిదాకా మహేష్ పక్కన శ్రద్ధ కపూర్, పరిణీతి చోప్రా పేర్లు వినపడ్డాయి. అయితే ఫైనల్ ఇప్పుడు అలియా భట్ పేరు కూడా ఫిల్మ్ నగర్ లో సంచరిస్తుంది. ప్రస్తుతం ఎలాంటి నిర్ణయాన్ని ఫైనలైజ్ చేయని చిత్రనిర్మాతలు త్వరలో సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను తెలియచేస్తారని అంటున్నారు.  


ఇక మహేష్ నటిస్తున్న బ్రహ్మోత్సవం ఈ నెల మూడో వారంలో రానుంది. మే 7న జరుగనున్న ఆడియోని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. పివిపి బ్యానర్లో శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: