నిన్న అమెరికాలో వేసిన సూర్య ‘24’ ప్రీమియర్ షోలకు అమెరికాలోని తెలుగు వారు బ్రహ్మరధం పట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. అమెరికా అదేవిధంగా మరికొన్ని  ఫారిన్ కంట్రీస్ లో వేసిన ఈ సినిమా ప్రీమియర్ షోలకు విపరీతమైన స్పందన వచ్చింది. తెలుస్తున్న సమాచారం మేరకు ‘24’ పై యునానిమస్ గా పాజిటీవ్ టాక్ వచ్చింది అని టాక్. ఇటువంటి కథతో ఇప్పటి వరకు ఎవరూ సినిమా తీయడానికి ప్రయత్నించ లేదని ఈ సినిమా ఇంటర్ వెల్ ట్విస్ట్ అయితే అసలు ఊహకు అందలేదని ఈ ప్రీమియర్ షోను చూసిన ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

డ్రామా, యాక్షన్, రోమాన్స్, సెంటిమెంట్ సమపాళ్ళలో కుదిరింది. మొత్తమ్మీద ’24’ సరికొత్త అనుభూతిని ఇచ్చే సినిమాగా మారుతుందని ఓవర్సీస్ ప్రేక్షకులు ‘24’ పై ప్రశంసలు కురిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా ప్రముఖ బాలీవుడ్ సినీ విమర్శకుడు, మూవీ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ '24' ప్రివ్యూ షో చూసి సినిమాపై ప్రశంసల వర్షం కురపించాడు. అంతేకాదు ‘24’ లాంటి సినిమా తీయాలంటే ఎంతో ధైర్యం, నిబద్ధత, సినిమా పై పట్టు ఉండాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

ఈసినిమా 2 గంటల 40 నిమిషాల పాటు ఉన్న ఎక్కడా బోర్ అన్నది రాదనీ ఈ సినిమా కథలో ప్రేక్షకుడు లీనమై పోతాడని ఊహకందని ట్విస్టులు అపరిమితమైన వినోదంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకుడు ఒక వింత అనుభూతిని పొందుతాడని తరణ్ ఆదర్స్ అభిప్రాయ పడ్డాడు. ఈసినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు క్లైమాక్స్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ గా మారుస్తుందని అభిప్రాయ పడుతున్నాడు తరణ్ ఆదర్శ్. 

‘మనం’ సినిమాను అద్భుతంగా మలిచిన విక్రమ్ కుమార్ మరోసారి తన సత్తాను చాటాడు అని అంటూ మూడు భిన్నమైన పాత్రలు పోషించిన హీరో సూర్యకు ఈ సినిమాలోని  పెర్ఫామెన్స కు నేషనల్ అవార్డు వస్తుందని జోశ్యం చెపుతున్నాడు తరణ్ ఆదర్శ్. అయితే రొటీన్ మాస్ సినిమాలకు అలవాటు పడ్డ మన ఇరు రాష్ట్రాలలోని సామాన్య ప్రేక్షకులకు ఈసినిమా ఎంత వరకు నచ్చుతుంది అన్నదే ప్రశ్న. ఏమైనా ఈ సినిమా పై తెలుగు ప్రేక్షకులు ఏ తీర్పును ఇవ్వబోతున్నారో మరి కొద్ది గంటలలో తేలిపోతుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: