కోలీవుడ్ లో ఎందరు టాప్ హీరోలు ఉన్నా అజిత్ రేంజ్ ని ఇమేజ్ ని ఎవరూ అందుకోలేక పోతున్నారు. ఎప్పటికైనా రజినీకాంత్ స్థానాన్ని అజిత్ ఆక్రమిస్తాడు అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో వినపడుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఎంపరర్ పవన్ కళ్యాణ్ కూడ అజిత్ ను అనుసరిస్తున్నాడా అన్న సందేహం కలుగుతోంది. దీనికి కారణం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదల తరువాత పవన్ మార్చుకున్న గెటప్ అని అంటున్నారు. 

సినిమాల్లో తప్ప వీలైనంత వరకూ ఒరిజినల్ లుక్ తోనే కనిపించడం పవన్ స్పెషాలిటీ. ఇప్పుడు ప్రస్తుతం పవన్ మెయిన్ టైన్ చేస్తున్న లుక్ తోనే పవన్ భవిష్యత్ లో నటించబోయే సినిమాలు అన్నీ ఉంటాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసమే పవన్ తన అభిమానులకు తన మార్చుకున్న గెటప్ ను పరిచయం చేయడమే కాకుండా ఆ లుక్ తోనే ఫంక్షన్స్ కు వస్తూ తన రాబోయే సినిమాలలో ఇదే పెప్పర్ లుక్ లో కనిపిస్తానని సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం పవన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా  ఒక ఫ్యాక్షనిస్ట్ లవ్ స్టోరీ. రెండేళ్ల క్రితం అజిత్ హీరోగా తమిళ్ లో ‘వీరమ్’ సినిమాను మన తెలుగు సినిమా పరిస్థుతులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి ఎస్.జె. సూర్య తీస్తుతున్నాడు. ఈసినిమాలో పవన్ తన రియల్ ఏజ్ కి దగ్గరగా ఉండేలా హాఫ్ వైట్ హెయిర్ తోనే కనిపిస్తాడు అని టాక్. ఈవార్తలను బట్టి తెలుగులో ఇలా రియల్ లుక్ తో తొలి  హీరోగా పవన్ ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు అనుకోవాలి. 

ఈ సినిమా కథకు సంబంధించి పవన్ కు ఈ లుక్ అన్ని విధాల సరిపోతుందని దర్శకుడు ఎస్.జె. సూర్య పట్టుబట్టి పవన్ లుక్ లో ఈ మార్పులు తెచ్చాడని టాక్. ఎస్.జె. సూర్యాకు కోలీవుడ్ హీరో అజిత్ కు ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఈ సలహాల వెనుక అజిత్ సలహాలు కూడ పవన్ ను బాగా ప్రభావితం చేసాయి అని అంటున్నారు. చిరంజీవి వెంకటేష్, బాలకృష్ణ కుర్ర హీరోలతో సమానంగా యంగ్ లుక్ తో కనిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటే దీనికి భిన్నంగా పవన్ ప్రవర్తిస్తూ తన స్పెషాలిటీని చాటుకుంటున్నాడు అను కోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: