చిరంజీవి 150వ సినిమా ‘కత్తిలాంటోడు’ షూటింగ్ ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలు కావడంతో ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక గురించి దర్శకుడు వినాయక్ నిర్మాత రామ్ చరణ్ లు చాల సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు టాక్. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించడం ఇంచుమించు ఖాయం కావడంతో మిగతా నటీనటుల ఎంపిక గురించి చర్చలు జరుగుతున్నాయి అని తెలుస్తోంది. 

ఈ సినిమాను వినాయక్ ఒక సామాజిక అంశంతో కూడుకున్న పక్కా మాస్ మూవీగా నిర్మించాలి అని ప్రయత్నిస్తున్న నేపధ్యంలో చిరంజీవి అభిమానులకు జోష్ ఇచ్చే విధంగా ఈసినిమాలో ఒక హాట్ ఐటమ్ సాంగ్ ను పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో చరణ్ వినాయక్ లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అటువంటి మాస్ ఐటమ్ సాంగ్ ట్యూన్ ఇవ్వడానికి దేవిశ్రీప్రసాద్ కసరత్తులు చేస్తున్న నేపధ్యంలో ఈ ఐటమ్ సాంగ్ కు చిరంజీవి పక్కన ఎవరు బాగుంటారు అన్న ఆలోచనలు కూడ చరణ్ వినాయక్ ల మధ్య చర్చలకు వచ్చినట్లు తెలుస్తోంది. 

వీరి చర్చలలో రేష్మీ రెజీనాల పేర్లు కూడ ఆలోచనకు వచ్చినట్లు టాక్. అయితే ఈ వార్తలు వీరిద్దరికీ లీకులు అందడంతో ఎట్టి పరిస్తుతులలోను చిరంజీవి 150వ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం కోసం అప్పుడే రేష్మీ రెజీనాలు తమవంతు ప్రయత్నాలు మెగా కాంపౌండ్ లో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే రెజీనాకు సాయి ధరమ్ తేజ్ తో ఉన్న సాన్నిహిత్యంతో పాటు ఇప్పటికే మెగా హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న నేపధ్యంలో రెజీనాకు ఎక్కువ అవకాశాలు ఉండవచ్చు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే మెగా స్టార్ చిరంజీవి ఇమేజ్ ముందు ఐటమ్ సాంగ్ లో చేయడానికి రేష్మీ రెజీనాలు గ్లామర్ విషయంలో సరిపోతారా అన్నదే ప్రశ్న.. 



మరింత సమాచారం తెలుసుకోండి: