బాలీవుడ్ బాదుషాగా ఎన్నో సంవత్సరాలుగా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న షారూఖ్ ఖాన్ కు సంబంధించి ఒక ఆశ్చర్యకర వార్తను ఒక మీడియా సంస్థ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. భారతదేశంలో స్టార్ హీరోల పారితోషికాలు ఊహలకు కూడ అందని స్థాయిలో పెరిగి పోయిన నేపధ్యంలో వందల కోట్ల ఆస్థులకు వారసులుగా మన స్టార్ హీరోలు మారిపోతున్న సంగతి తెలిసిందే. కేవలం సినిమాల వల్లనే కాకుండా ప్రకటనలు స్టేజ్ షోలు రకరకాల వ్యాపారాలతో మన సినిమా సెలెబ్రెటీలు నిజంగానే స్టార్స్ లా వెలిగి పోతున్నారు. 

అయితే షారూఖ్ ఖాన్ సంపద గురించి ఒక ప్రముఖ మీడియా సంస్థ ప్రకటించిన ఆస్థుల వివరాలు ఇప్పుడు బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. బాలీవుడ్ బాద్షా షారూఖ్ కు ఏకంగా 39 వేల కోట్ల ఆస్థులు ఉన్నట్లు ఆ మీడియా సంస్థ కథనం. ప్రపంచంలోని సినిమా తారల ఆస్థుల పై సర్వే చేసిన ఈ మీడియా సంస్థ షారూఖ్ ఆస్థుల విలువ 600 మిలియన్ డాలర్లని అంటే అక్షరాలా 39,791,970,000 రూపాయలనే షాకింగ్ నిజాలను బయట పెట్టి అందరి మైండ్ ను బ్లాంక్ చేసింది. 

అంతేకాదు  ప్రపంచ నటుల్లో అత్యధిక సంపన్నుల జాబితాలో షారుఖ్ ది రెండో స్థానం అని ఆ మీడియా సంస్థ కథనం. హీరోలు యాడ్స్ ద్వారా సినిమాల కంటే ఎక్కువ సంపాదించవచ్చన్న విషయాన్ని నిరూపించింది షారూఖ్ ఖాన్.  ఏడాదికో రెండేళ్లకో ఓ సినిమా చేసే షారుఖ్ యాడ్స్ లో మాత్రం ఎక్కువగా ఎప్పుడూ  కనిపిస్తూ విపరీతంగా సంపాదిస్తున్న విషయం తెలిసిందే. 

భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో షారూఖ్ ఖాన్ కు ఆస్తులు ఉన్నాయి. వైపు ఐపీఎల్ టీం ద్వారా షారూఖ్ సంపాదిస్తున్న సంపాదనతో పాటు తన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ద్వారా వందల కోట్లను అధికారికంగానే షారూఖ్ వెనకేశాడు.  ఇండియన్ సినిమా రంగంలో ఖాన్ త్రయం హీరోలకు ఉన్నంత క్రేజ్ అదేవిధంగా వారికి ఉన్నంత ఆస్థులు మన దేశంలో మరే హీరోకి లేవంటే అతిశయోక్తి కాదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: