శ్రీదేవిని మినహా మిగతా హీరోయిన్స్ ను పెద్దగా ఆరాధించడు రామ్ గోపాల్ వర్మ. అయితే అటువంటి వర్మను మత్తుమత్తుగా మత్తెక్కించేభామ రాధికా ఆప్టే వర్మకు మూడు జన్మలకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈమధ్య ఒక ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ కు ఈ బ్యూటీ ఇచ్చిన హాట్ ఫోటో షూట్ ను చూసి అందరూ అదిరిపోయారు. 

బాలీవుడ్ లో ఎందరో టాప్ హీరోయిన్స్ ఉన్నా ఎక్స్ పోజింగ్ లో రాధిక ఆప్టే చూపించే తెగువ మరేహీరోయిన్ చేయలేదు. అహల్య అనే బెంగాలీ షార్ట్ ఫిలింలో రాధిక ఎక్స్ పోజింగ్ ను చూసిన వాళ్లు ఆమె గ్లామర్ కు ఫిదా అయిన నేపధ్యం తెలిసిందే. ఆ తరువాత ఆమెకు చాల సినిమాలలో అవకశాలు వచ్చాయి. ప్రస్తుతం ఈమె ఏకంగా రజినీకాంత్ తో ‘కబాలి’ సినిమాలో రజినీ భార్యగా చాల సాంప్రదాయంగా కనిపిస్తోంది. 

ఈ పరిస్థుతుల నేపధ్యంలో లేటెస్ట్ గా ఈమె ఎఫ్ హెచ్ ఎం మ్యాగ్ జైన్ కోసం ఇచ్చిన హాట్ ఫోటో షూట్ ను చూసి అందరూ షాక్ అయిపోతున్నారు. ఈ ఫోటో షూట్ కు ఎందరో హీరోయిన్స్ ను ఎంతో హాట్ గా చూపించిన రామ్ గోపాల్ వర్మ కూడ ఫిదా అయిపోవడం ఇప్పుడు షాకింగ్ న్యూస్ గా మారింది. అతిలోక సుందరి శ్రీదేవిని తప్పించి మరే హీరోయిన్ ను పొగడని వర్మ రాధిక ఎక్స్ పోజింగ్ ను చూసి తన గడిచిన మూడు జన్మల్లో ఇంత హాటెస్ట్ అమ్మాయిని చూడలేదంటూ ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. 

 దీనితో శ్రీదేవి అందాన్ని తప్ప ఇంతవరకూ ఇంకెవరిని పొగడని వర్మకు ఉన్నట్లుండి రాధికా ఆప్టే మీద మనసు ఎందుకు పడింది అంటూ చాలామంది వర్మ పై సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం వర్మ బాలీవుడ్ లో చాల భారీ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్న నేపధ్యంలో ఈమెకు మంచి అవకాశాలు ఇస్తాడేమో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: