ఢిల్లీ సుందరి తాప్సీ పన్నుకు ఓ వీరాభిమాని ఇచ్చిన షాక్ కు ఏం చేయాలో తోచని పరిస్థితి అయ్యింది. తన సోదరితో కలిసి వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తాప్సీకి అనుకోని కష్టాలు ఎదురయ్యాయి. ఇంతకీ తాప్సీకి వచ్చిన కష్టం ఏంటి అంటే ఓ అభిమాని వల్ల అమ్మడు ఇబ్బందులు పడిందట. అదేంటి అంటే వివరాలు ఇలా ఉన్నాయి.


సినిమాల్లో సంపాదించిన సొమ్మంతా దాచుకుని ఏదో ఒక బిజినెస్ చేయడం మాములే అయితే అందరి దారిలో కాకుండా తాప్సీ కొత్తగా వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. అయితే అనుకోకుండా ఓ అభిమాని తనకు తలనొప్పిగా మారడం జరిగిందట. కోల్ కతా కు చెందిన ఓ తాప్సీ అభిమాని వారు చేస్తున్న వెడ్డిన ప్లానర్ సహకారం కోరాడట.  


అయితే వారు చేసేదే వెడ్డింగ్ ప్లానింగ్ కాబట్టి వారు ఓకే చెప్పారట. అయితే అది తాప్సీ బిజినెస్ అని తెలిసిన అభిమాని తాప్సీ తన పెళ్లికి రావాల్సిందిగా కోరాడట. అయితే తాప్సీ రావడం కుదరదని చెప్పేసిందట. ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే అసలు అతనికి ఇంకా పెళ్లి కూడా సెట్ అవ్వలేదట. రంగంలో దిగిన తాప్సీ ముందు ఓ అమ్మాయిని వెతుక్కో ఆ తర్వాత వచ్చేది రానిది చెబుతా.. అయినా నేను చాలా బిజీగా ఉన్నాను. నా డేట్స్ ఖాళీ లేవు అని చెప్పిందట.  


అయితే మనోడు రూటు మార్చి ఓ మంచి కథ ఉంది. దర్శకుడిని పంపించమంటారా అని వేశాలెస్తున్నాడట. అయితే మర్యాదగా చెప్పి అతన్ని మరళ తాప్సీ జోలికి రాకుండా చేశారట తన టీం. మొత్తానికి అభిమాని ఇచ్చిన షాక్ కు తాప్సీకి ఇరిటేషన్ వచ్చిందని బీ టౌన్ టాక్. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు దక్కించుకోలేని ఈ భామ బాలీవుడ్లో లక్కీ ఆఫర్స్ కొట్టేస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: