ఏప్రిల్ 8న రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమా ''ది జంగిల్ బుక్ '' ఇండియాలో వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తోంది . ఇప్పటికే 240 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళ ని 173 కోట్లకు పైగా షేర్ ని సాధించి సరికొత్త సంచలనం సృష్టించింది ది జంగిల్ బుక్ . వాస్తవానికి జంగిల్ బుక్ తో భారతీయులందరికీ దూరదర్శన్ రోజుల నుంచీ అనుబంధం ఉంది. ముఖ్యంగా అందులో మోగ్లీ పాత్రకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు.. అపట్లో చిన్న పిల్లలకు ఆ పేరు పెట్టుకున్న వారు కోట్లలో ఉన్నారు. ఇప్పుడు  హాలీవుడ్ లో రూపొందిన ఈ సినిమాను ఇండియన్ సినిమాలా భావించి ఆదరిస్తున్నారు.


''ది జంగిల్ బుక్ '' లో ఓ దృశ్యం


టెక్నాలజీ పరంగా ఎన్నో అద్భుతాలు సృష్ణిస్తున ఈ సమయంలో మరో అద్భుత దృశ్యరూపమే ద జంగిల్ బుక్. సీజీఐ టెక్నాలజీతో ఆ ఫిల్మ్ డైరక్టర్ జాన్ ఫవ్రూ ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. హీరో మోగ్లీ తప్ప మిగతా అన్ని క్యారక్టర్లు కంప్యూటర్ కళా చిత్రాలే. అంటే సీజీఐ అంటే కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ.  పాంథర్ భగీర, టైగర్ షేర్‌ఖాన్, ద బియర్ బాలూ, ద పైతాన్ కా, చింపాంజీ కింగ్ లూయి, మోగ్లీని పెంచి పోషించిన నక్కలు. ఆ మూగ జీవాలకు సీజీఐ టెక్నిక్ ప్రోణం పోసింది.


''ది జంగిల్ బుక్ '' లో ఓ దృశ్యం


ఇప్పటివరకు ఏ హాలీవుడ్ చిత్రం కూడా ఇండియాలో ఇంత భారీ స్థాయి  లో కలెక్షన్ల ని రాబట్టలేక పోయింది కానీ ది జంగిల్ బుక్ ఆ అరుదైన ఫీట్ ని అందుకోవడంతో  ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్య పోతున్నారు . జాన్‌ ఫావ్రో దర్శకత్వంలో నీల్‌సేథి ప్రధాన పాత్రధారిగా గత శుక్రవారం విడుదలైన 'ది జంగిల్‌ బుక్' మంచి వసూళ్లు రాబడుతోంది. తొలిరోజే రూ. 9.76 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.ఇక అక్షయ్‌కుమార్‌ హీరోగా 2016లో విడుదలైన 'ఎయిర్‌లిఫ్ట్' తరువాత తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమాగా 'ది జంగిల్‌ బుక్‌' నిలించింది. ఎప్పుడో 1894లో ఒక నవలగా విడుదలైన జంగిల్ బుక్ కథ సారాంశం ఆధారంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం జోడించి కన్నులకు కట్టినట్లుగా తీర్చిదిద్దారు.



మరింత సమాచారం తెలుసుకోండి: