సెలబ్రెటీలు ఏవి చేసినా వింతగానే ఉంటాయ..ఒక్కోసారి విరి వ్యవహారాలు శృతిమించిపోవడం పది మంది ముందు అవమానం జరిగిన సంఘటనలు చాలా జరిగాయి. తాజాగా ఓ హాలీవుడ్ నటి ఫుల్లుగా తాగేసి  ఎయిర్ స్టాఫ్ మీద చిందులు వేయడంతో ఆ స్టాఫ్ భలే బుద్దిచెప్పారు. వివరాల్లోకి వెళితే..హాలీవుడ్ లో ఒకప్పుడు సెక్సీ హీరోయిన్ గా బాగా పాపులర్ అయిన  హార్లే మేక్ బ్రైడ్ అనే కి ఘోర అవమానం జరిగింది.  ఈ నటి యూఎస్ లో ఆ మధ్య న్యూయార్క్ నుంచి ఫ్రాన్స్ వెళ్ళే విమానం ఎక్కింది. అయితే అంతకుముందే బాగా మందు లాగించేయడంతో ఇక విమానంలో సీట్లో కూచున్నప్పటి నుంచి ఎయిర్ స్టాఫ్ మీద చిందులు వేయడం ప్రారంభించింది.  

ఎవరు ఎంత చెప్పినా వినకుండా వారితో ఘర్షణకు దిగడంతో చేసేది లేక ఆమెను సీటుకు కట్టేశారు. ఈవిడ గారి గోలతో పైలట్ విమానాన్ని మధ్యలోనే అత్యవసరంగా  ఒక చోట దింపేశాడు. హార్లే కి తెలివి వచ్చి చూసేసరికి పోలీసులు ఆమె వద్ద ప్రత్యక్షమయ్యారు.

గతంలో కూడా హార్లే ఇలాగే ప్రవర్తించడం జరిగిందట. యంగ్ లేడీ చటర్లీ అనే మూవీలో హాట్ హాట్ గా కనిపించి అప్పట్లో పెద్ద సంచలనమే రేపిందట. లిక్కర్ అంటే పడి చచ్చే ఈ అమ్మడుకి విమానంలో చేసిన గొడవ పెద్ద జరిమానే చెల్లించాల్సి వచ్చింది. కోర్టులో ఆమెను హాజరు పరచగా ఆమెకు 36 వేల డాలర్ల జరిమానా పడింది.  
 2014 లో జరిగిన ఈ మాజీ నటి వ్యవహారం ఇప్పుడు బయటికొచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: