ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి రాజమౌళి అనేక విషయాలు చెప్పాడు. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా ‘బహుబలి’ అని నిర్ణయించినట్లు చెప్పాడు. తన కొత్త సినిమా చారిత్రాత్మక కథాంశంతో రూపొందే సినిమా కాకపోయినా, కత్తులూ, యుద్ధాలు తమ సినిమాలో ఉంటాయిని తెలిపాడు. ఆసక్తి ఉన్న వారికి తమ సినిమాలో అవకాశం ఇస్తానని, ఆసక్తి ఉన్నవారు వివరాలు పంపించాలని రాజమౌళి కోరాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: