రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాను చూసి ఒక ప్రముఖ వ్యక్తి అప్పుడే రేటింగ్స్ కూడ ఇచ్చేసాడు. అతడు మరెవరో కాదు దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ ఇండియన్ సినిమా మ్యాగజైన్ ఎడిటర్ ఉమర్ సంధు. ఇతడి పేరు ఈ మధ్య కాలంలో మీడియాలో తరుచు వినిపిస్తోంది. టాప్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలను ముందుగా చూసి ఆ సినిమాల పై తన రేటింగ్ ను తన ట్విటర్ లో పోస్తుచేస్తూ ఈమధ్య కాలంలో నానా  హడావిడి సృష్టిస్తున్నాడు. 
బాహుబలి’ సినిమాకు ఆ సినిమా విడుదలకు ముందు 2 స్టార్ రేటింగ్ ఇచ్చి ప్రభాస్ భిమానుల ఆగ్రహానికి గురియ్యాడు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా బ్లాక్ బస్టర్  హిట్ అవుతుంది అని ముందుగా ఇతడు జోస్యం చెప్పినా ఆ జోస్యం ఫలించలేదు. అయితే ఇతడు అల్లుఅర్జున్ సినిమా ‘సరైనోడు’ విషయంలో చెప్పిన జోశ్యం ఫలించింది. 

ఇలాంటి పరిస్థుతులలో ఇతడు మళ్ళీ సీన్ లోకి వచ్చి రేపు విడుదల కాబోతున్న ‘బ్రహ్మోత్సవం’ మూవీకి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది అంటూ మహేష్ అభిమానులకు మంచి జోష్ ను ఇచ్చే ట్విట్ ను చేసాడు. అంతేకాదు ఈసినిమాలో మహేష్  నటన అద్భుతం అని ప్రశంసిస్తూ ‘బ్రహ్మోత్సవం’ ను ఆకాశంలోకి ఎత్తేశాడు ఉమర్ సంధు.

ఇది ఇలా ఉండగా రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ధియేటర్ల వద్ద అప్పుడే పండుగ వాతావరణo వచ్చేసింది. ఈ సినిమా విడుదల అవుతున్న థియేటర్స్ వద్ద అలంకరణ చూస్తుంటే మండు వేసవిలో సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘శ్రీమంతుడు’ సినిమా తరువాత విడుదల అవుతున్న మహేష్ సినిమా కావడంతో ప్రతి ఊరులోను భారీ హోర్డింగ్స్, వినైల్స్ ఏర్పాటు చేసి 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని టాక్ ఆఫ్ ది టౌన్ గా మార్చేస్తున్నారు. ఈ సినిమాకు ఏర్పడ్డ క్రేజ్ తో మొదటి మూడు రోజుల షోలకు అప్పుడే టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ లో అయిపోవడం మహేష్ స్టామినాను సూచిస్తోంది. ఒక వైపు మహేష్ అభిమానులు తిరుపతి బ్రహ్మోత్సవాల స్థాయిలో ఈ సినిమా కోసం హడవిడిని చూస్తూ ఉంటే ‘బ్రహ్మోత్సవం’ మరో సంచలనమైన రికార్డులకు తెర తీయబోతోంది అని అనిపిస్తోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: