మెగాబ్రదర్ నాగబాబు నిన్న ‘ఒక మనసు’ ఆడియో ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. తన కూతురు నిహారిక టాలీవుడ్ ఎంట్రీ గురించి మొట్టమొదటి సారి నాగబాబు తన మనసులోని మాటలను బయట పెట్టాడు. ‘నా కూతురు హీరోయిన్ అవుతానంటే సపోర్ట్ చేసిన రామ్ చరణ్ - వరుణ్ తేజ్ - సాయిధరం తేజ్ - అల్లు అర్జున్ ఇలా సేమ్ జనరేషన్ లో ఉన్న అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. కానీ వాళ్లు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి థ్యాంక్స్ చెప్పకపోయినా హ్యాట్సాఫ్ అంటాను’ అంటూ తన కూతురు హీరోయిన్ అవుతానని చెప్పినపుడు వద్దని అన్నాను అన్న విషయాన్ని బయటపెట్టాడు. 

అయితే  ‘హీరోలు వస్తున్నపుడు మాట్లాడని మీరంతా ఆడపిల్ల వస్తానని అన్నపుడు ఎందుకు అడ్డు చెపుతున్నారు’ అంటూ  తన ప్రశ్నతో నిహారిక తన  నోరు మూయించింది అన్న విషయాన్ని షేర్  చేసుకున్నాడు. నిహారిక గురించి కాదు అందరి అమ్మాయిల గురించి తాను మాట్లాడాలని అనుకుంటున్నాను అంటూ  పుట్టిన దగ్గర నుంచి పెళ్లి చేసి చేతులు దులుపుకుందామని అనుకునే తల్లిదండ్రులకు ఒక మాట చెప్పాలి అని భావిస్తున్నానని చెపుతూ అందరి  అమ్మాయిలకు కూడా తమ కెరీర్ ఎంచుకునే అవకాశం ఉండాలి అంటూ కామెంట్ చేసాడు.

అమ్మాయిలకు పెళ్లి చేసేస్తే ఏడాదికల్లా పిల్లల్ని కనేసి జీవితం అక్కడితే ఆగిపోతుందని అందువల్ల అడపిల్లలను కూడా అబ్బాయిల మాదిరిగానే ఎంకరేజ్ చేద్దాంఅంటూ ఒక సందేశం ఇవ్వడానికి నాగబాబు ప్రయత్నించాడు. అమ్మాయిలకు కూడ ఎన్నో కలలు ఉంటాయి అని అంటూ వాటిని సాకారం చేసుకునేందుకు మనమంతా సహకారం ఇద్దాo  అంటూ అందరి అమ్మాయిల తరఫున నాగబాబు మాట్లాడుతూ తాను  ఏ పరిస్థితులలో నిహారిక టాలీవుడ్ ఎంట్రీకి ఓకే చెప్పిన విషయాన్ని వివరించడానికి ప్రయత్నించాడు. 

అయితే ఈ ఆడియో ఫంక్షన్ కు వచ్చిన చాలా మంది నాగబాబు స్పీచ్ విని ఇక రానున్న రోజులలో చాలామంది స్టార్లు  తమ ఇంటి ఆడపిల్లలను హీరోయిన్లుగా పరిచయం చేసేందుకు ముందు కొచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ కామెంట్ చేయడం ఈ కార్యక్రమoలో కొసమెరుపు. ఏమైనా నాగబాబు కామెంట్స్ టాలీవుడ్ లో మరో కొత్త చర్చలకు తెరతీసాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: