నిన్న జరిగిన ‘ఒక మనసు’ ఆడియో ఫంక్షన్ లో హీరో నాగశౌర్య తన మాటలలో అక్కినేని నాగార్జున పై తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచేలా అన్న ఒక్క మాట పై విశ్లేషకులు రకరకాల అర్ధాలు వెతుకుతున్నారు. ‘ఊహ‌లు గుస‌గ‌స‌లాడే’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ మధ్య ఫ్లాప్ ల తరువాత ఈ సంవత్సరం విడుదలైన  ‘క‌ళ్యాణ వైభోగ‌మే’ సినిమా ద్వారా తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు. 

అయితే నాగశౌర్యకు సంబంధించి ఒక ఆ సక్తికర విషయం ఉంది. ఈ యంగ్ హీరో అక్కినేని నాగార్జునకు వీరాభిమాని. చాల కాలం క్రితం నాగశౌర్య నటించిన మొట్టమొదటి సినిమా ‘ఊహ‌లు గుస‌గుస‌లాడే’ సినిమాను చూసి అప్పట్లో బాలకృష్ణ ఈ యంగ్ హీరోను బాగా మెచ్చుకున్నాడు. ఈ  సందర్భాన్ని కొన్ని మీడియా వర్గాలు నగసౌర్య దృష్టికి తీసుకు వచ్చినప్పుడు ‘బాల‌కృష్ణ గారు నా సినిమా చూసి బాగుంది అని చెప్ప‌డం సంతోష‌మే కానీ నా అభిమాన హీరో నాగార్జున గారు నా సినిమా చూసి బాగుంది అని చెబితే నాకు 100% తృప్తిగా ఉంటుంది’ అంటూ మీడియా ఇంటర్వ్యూలో అప్పట్లో షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

ఆ సంఘటన జరిగి చాల కాలం అయిపోయిన తరువాత తిరిగి నాగశౌర్య తనకు నాగార్జున పట్ల ఉండే అభిమానాన్ని గుర్తుకు చేసే విధంగా నిన్న ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. నిన్నటి ‘ఒక మనసు’ ఆడియో ఫంక్షన్ లో నాగశౌర్య మాట్లాడుతూ ‘గీతాంజలి’ సినిమాలా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలా ‘ఒక మనసు’ నిలిచి పోతుందని కామెంట్ చేసాడు.

ఈ ఆడియో ఫంక్షన్ కు వచ్చిన చాలామంది నాగశౌర్య స్పీచ్ విని ఈ యంగ్ హీరోకి నాగార్జున పై ఉన్న అభిమానం ఇంకా తగ్గలేదు అనీ అందువల్లనే అందరు మెగా హీరోల మధ్య నాగ శౌర్య నాగార్జున భజన చేశాడు అని జోక్స్ వేసుకున్నట్లు టాక్. అయితే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా విడుదల అవుతున్న ‘ఒక మనసు’ సక్సస్ అయినా అది ఎంత వరకు ఈ యంగ్ హీరో కెరియర్ కు ఉపయోగ పడుతుంది అన్నదే ప్రశ్న..


మరింత సమాచారం తెలుసుకోండి: