తెలుగు సినిమా రికార్డులను తిరగరాసి ఇండియన్ టాప్ సినిమాలలో స్థానం పొందిన ‘బహుబలి’ కి సంబంధించిన మూడవ అవతారం ట్విస్ట్ బయట పెట్టాడు రాజమౌళి. తెలుస్తున్న సమాచారం మేరకు  ‘బాహుబలి2' ఒక కొత్త టెక్నాలిజీతో మన ముందుకు రాబోతోంది. ప్రపంచ సినిమారంగం కనుక్కున్న సరికొత్త శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) తో ఈసినిమాను రూపొందించా బోతున్నారు.

ప్రస్థుతం రాజమౌళి ఈపనిలో బిజీగా బున్నాడు. ‘బాహుబలి 2’ ది కంక్లూజన్‌ తోపాటు అదే సమయంలో వీఆర్‌ వెర్షన్‌ 'బాహుబలి2' ని కూడా సిద్ధం చేస్తున్నారు. కేన్స్‌ చలనచిత్రోత్సవంలో  ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవిషయం గురించి ఆసక్తిక విషయాలను బయటపెట్టాడు రాజమౌళి. ‘బాహుబలి ది కంక్లూజన్‌' పనులు శరవేగంగా జరగుతున్నాయి అన్న విషయాన్ని చెపుతూ ఈసినిమాను సరికొత్త విధానంలోచితీకరిస్తూ మరో  'బాహుబలి 3'ని తయారు చేస్తున్న విషయం బయట పెట్టాడు.

రెండేళ్ల క్రితం తన సోదరుడు ఏఎండీ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ రాజా కోడూరి ఈ వర్చువల్‌ రియాలిటీ గురించి చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఈటెక్నిక్ ద్వారా ఒక మంచి కథ చెప్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ప్రభావమే ఈప్రయోగం అని అంటున్నాడు. వీఆర్‌ పరిజ్ఞానంతో ప్రపంచంలో తొలిసారిగా సినిమా తీస్తున్న రికార్డు ‘బాహుబలి’ సొంతం అన్న విషయాన్ని బయట పెట్టాడు. సాధారణంగా సినిమా తీస్తున్నప్పుడు కెమెరా యాంగిల్‌, ఎడిటింగ్‌ తదితర అంశాలపై అవగాహన ఉంటుందని అదే వీఆర్‌ సినిమా దగ్గరకు వచ్చేసరికి అంతా కంప్యూటర్‌ మీదే ఆధారం అని అంటున్నాడు.  సినిమాలోని ఒక సీన్ లో వంద అడుగుల విగ్రహం కావాలి అది ఇలా వాలిపోవాలి చుట్టూ చిన్న చిన్న ముక్కలు గాల్లో ఎగరాలి లాంటి అంశాలను సినిమాలో చూపించడం సులభం అని అంటూ అదే వీఆర్‌ లో అయితే అంత సులభంకాదు అన్న విషయాన్ని బయటపెట్టాడు ఈ ‘బాహుబలి’ సృసి కర్త.

వీఆర్‌ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి ఆయాపాత్రల మధ్యలో ఉన్నట్లుగా ఉంటుంది అని చెపుతూ దీనితో ఎమోషన్స్ వినోదం పండే తీరు మారుతుంది అన్న కొత్తవిషయం బయట పెట్టాడు.  ‘బాహుబలి' లో యుద్ధం సన్నివేశం చూస్తుంటే ప్రేక్షకుడికి యుద్ధరంగం మధ్యలో ఉన్న అనుభూతి కలుగుతుంది అని అంటూ వీఆర్‌ పద్ధతిలో ప్రత్యేకంగా చిత్రీకరించిన సీన్స్ ను వీఆర్‌ హెడ్‌సెట్‌ పెట్టుకుంటేనే చూడగలం అన్న విషయాన్ని కూడ లీక్ చేస్తూ తన మూడవ బాహుబలి విషయాలను వివరించాడు. దీనిని బట్టి చూస్తూ ఉంటే రానున్న రోజులలో తెలుగు సినిమా నిర్మాణంలో పెను మార్పులు వస్తాయి అనుకోవచ్చు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: