ఈరోజు ఉదయం విడుదల అయిన 'బ్రహ్మోత్సవం’ ఇంకా చాలా చోట్ల షోలు పూర్తి కాకుoడానే ఆసినిమాకు సంబంధించినటాక్ బయటకు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈసినిమా షోలు ఈరోజు ఉదయం నుంచే ప్రారంభం కావడంతో ఈసినిమా టాక్ లీక్ అయింది. ఈసినిమా ఊహించిన స్థాయిలో లేదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. 

దీనికి కారణం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈసినిమా కోసం వ్రాసిన స్క్రీన్ ప్లే ఏ మాత్రం సరిగా కుదరకపోవడంతో ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే అవకశాలు లేవు అని అంటున్నారు. ఈసినిమా కోసం శ్రీకాంత్ అడ్డాల ఎంచుకున్న కాన్సెప్టు ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ దాన్ని ప్రేక్షకులు మెచ్చేలా తీర్చిదిద్దడంలో శ్రీకాంత్ అడ్డాల విఫలం అయ్యాడు అనే కామెంట్స్ వస్తున్నాయి. సినిమాలో మహేష్ బాబు, రావు రమేష్ పెర్ఫార్మెన్స్ చాలా బావుందని, ఇంటర్వెల్ ఎపిసోడ్, మిక్కీజే మేయర్ సాంగ్స్, రత్నవేలు సినిమాటోగ్రఫీ హైలెట్ గా ఉన్నాయని టాక్. 

అయితే ఈసినిమాలోసాంగ్స్ వెంటవెంటనే రావడం ప్రేక్షకులకు అసహనాన్ని కలిగించింది అన్న వార్తలు కూడ ఉన్నాయి. అయితే ఈ సినిమాలోని డైలాగ్స్ బాగున్నట్లుగా వార్తలు వస్తున్నా . సినిమా ఫస్ట్ హాఫ్ ఎండింగులో కుటుంబం విడిపోవడంతో ఎమోషనల్ సీన్లతో ఫ్యామిలీ ప్రేక్షకులతో కంటతడి పెట్టించాడు దర్శకుడు అని టాక్. అయితే ఈ ఎమోషనల్ సీన్స్ బిసి సెంటర్ల ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవచ్చని అంటూ ఈసినిమా చూస్తూ ఉంటే మరో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చూసిన ఫీలింగ్ కలుగుతోంది అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. 

స్టోరీ బలంగా లేకపోవడం, కథనం మందకొడిగా సాగడం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కు అడ్డుగా నిలిచే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే మహేష్ బాబు సూపర్ యాక్టింగ్ ఈసినిమాకు ప్లస్ పాయింట్ గా కనిపిస్తున్నా కేవలం మహేష్ స్టామినాతో ఈసినిమాను కొనుక్కున్న బయ్యర్లు గట్టెక్కడానికి కావలసిన 72 కోట్లు ఎక్కడ నుంచి వస్తాయి అన్న మాటలు అప్పుడే మొదలయ్యాయి. అయితే అసలు టాక్ బయటకు రావడానికి మరో కొంత సమయం పడుతుంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: