హీరోయిన్ సమంత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ గాసిప్ బాంబ్ పేల్చింది. తాను లవ్ మేరేజ్ చేసుకోబోతున్నానని చెప్పింది. అయితే తన పేరు మాత్రం చెప్పలేదు. కానీ అతని గురించి కొన్ని డిటైల్స్ చెప్పింది. అతను తనకు ఎప్పటి నుంచో పరిచయం అట. గతంలో తనతో నటించింది కూడానట. మరి ఇంతకీ సమంతాను పెళ్లి చేసుకునేది ఎవరు..

సమంత ఇచ్చిన క్లూలను బట్టి చూస్తే తెలుగులో సమంతాతో నటించిన పెళ్లికాని హీరోలు నలుగురే.. వారు రానా, బెల్లంకొండ శీను, నాగ చైతన్య, నితిన్.. ఇప్పుడు వీరిలో ఎవరు సమంతాను పెళ్లి చేసుకుంటారనేది మిలియన్ డాలర్ క్వశ్చన్.. మరి వీరిలో ఎవరో ఎలా తెలుస్తుంది.

రానా, శీను, నాగచైతన్య, నితిన్.. వీరిలో సమంత లవర్ ఉన్నాడా..



అందుకే సమంత కొన్ని క్లూలు ఇచ్చింది. తన లవర్ చాలా కూల్ అట. తనది కూడా నాలా హెల్పింగ్ నేచర్ అట. వంట సూపర్బ్‌గా చేస్తాడట. ఆలోచించి మాట్లాడతాడట. స్టేబుల్‌గా నిర్ణయాలు తీసుకుంటాడట. చాలా ఓపిక ఉందట. ఈ క్లూల ఆధారంగా పై నలుగురిలో సమంత లవర్ ఎవరో మీరే ఊహించండి. 

ఐతే.. ఇక్కడే ఓ మరో ట్విస్టు కూడా ఉంది. సమంత కుర్ర హీరోను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పింది కానీ.. తెలుగబ్బాయి అని చెప్పలేదు కదా. సో.. సమంత మనసు దోచిన కుర్రాడు తమిళ హీరో కూడా కావచ్చు. మరి అక్కడ సమంత ఎవరితో నటించింది.. వాళ్లలో సమంతను ప్రేమలో దించిన మొనగాడెవడు.. సమంత కాబోయే మొగుడు.. తమిళుడా.. తెలుగోడా.. ఇవన్నీ తేలాలంటే కాస్త టైమ్ పట్టొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: