‘బ్రహ్మోత్సవం’ తన ఆశలను తల క్రిందులు చేసిందని ఒకవైపు మహేష్ కోలుకోలేని షాక్ లో ఉంటే లేటెస్ట్ గా రామ్ గోపాల్ వర్మ తన పై వేసిన సెటైర్ తో మహెహ్ మైండ్ బ్లాంక్ అయిందని టాక్. మొన్నటి దాకా చిరంజీవిని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన వర్మ ఇప్పుడు తన రూట్ మార్చి మహేష్ బాబును టార్గెట్ చేస్తూ సంచలనాత్మక ట్విట్స్ చేసాడు. 

అంతేకాదు ఒకవైపు మహేష్ పై సెటైర్లు వేస్తూ తన సెటైర్లను పాజిటివ్ గా తీసుకోవాలని హిత భోధ చేసాడు వర్మ.’బ్రహ్మోత్సవం’ విడుదల అయిన దగ్గర నుంచి వెబ్ మీడియాలో సెటైర్లకు చిరునామాగా మారిపోయిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాలోని మహేశ్ డాన్సు వీడియోను వర్మ తన ట్వీటర్ లో షేర్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేసాడు. 
మహేష్ జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్ లాంటి వాళ్లతో డాన్స్ లో పోటీ పడలేక పోవచ్చేమో కాని మహేష్ బాబు బ్యాడ్ డాన్సర్ కాదు అంటూ మహేష్ పై ప్రశంసలు కురిపిస్తూనే మహేష్ బాబును చూసి ప్రపంచంలోని కొంతమంది ప్రముఖ డాన్సర్లు డాన్స్ ను నేర్చుకోవలసి వస్తుంది అంటూ మహేష్ పై సెటైర్ వేసాడు.  

అలాగే మహేశ్ ఎలాంటి సినిమా చేయాలో కూడా వర్మ ఒక రకమైన దిశానిర్దేశం చేశాడు. మహేశ్ నుంచి ప్రేక్షకులు ఒక్కడు, బిజినెస్ మ్యాన్, పోకిరి వంటి సినిమాలను కోరుకొంటారు కానీ ఇలాంటి ఫ్యామిలీ సబ్జెక్టులను కాదని వర్మ తన ట్విటర్ లో పెద్ద క్లాస్ పీకాడు. అంతేకాదు మహేష్ నటించవలసిన సినిమాలు ఎన్టీఆర్ కృష్ణల సినిమాలు లా ఉండాలి కాని ఒకనాటి ఫ్యామిలీ హీరో శోభన బాబు తరహా సినిమాలు మహేష్ కు ఎలా సూట్ అవుతాయి అని ఏకంగా మహేష్ కే షాక్ అయ్యేలా ప్రశ్నిస్తున్నాడు వర్మ.

ఇదే సందర్భంలో వర్మ మరో కామెంట్ చేస్తూ తనకు ‘దేవత’  సినిమా గుర్తుంది కానీ అందులో హీరో ఎవరనే విషయం గుర్తుండదని అని అంటూ అయితే  అదే ‘అడవిరాముడు’,’ ఏజెంట్ గోపి’ వంటి సినిమాల కథలు కన్నా ఆ సినిమాల లోని హీరోలే గుర్తుండి పోతారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు వర్మ. అయితే వర్మ చేసిన కామెంట్స్ ఎలా ఉన్నా అతడి ట్విటర్ లో వాడిన  భాషలోని భావం మాత్రం మహేష్ ను చాల నిశితంగా ఆలోచింప చేస్తున్నది అన్నది వాస్తవం..   


మరింత సమాచారం తెలుసుకోండి: