ఎంత ఆర్భాటంగా ఉంటే అంత గొప్ప అని అనుకునే సినిమా రంగంలో ఎప్పుడూ తలవంచుకుని వెళ్ళిపోయే  మిక్కి జే మేయర్ ను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. తెలుగుసరిగ్గా మాట్లాడటం రాని ఈ సంగీత దర్శకుడు తెలుగు దనం ఉట్టిపడే అద్భుతమైన పాటలకు సంగీతాన్ని ఎలా సమకూరుస్తున్నాడు అన్నది ఎవరికీ సమాధానం లేని ప్రశ్న.

సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే మిక్కీ ఒక దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆ శక్తికర విషయాలను షేర్ చేసాడు. తన సినిమాల గురించి అదేవిధంగా తన కుటుంబ నేపధ్యం గురించి అనేక విషయాలను ఈ ఇంటర్వ్యూలో ఈ యువ సంగీత దర్శకుడు షేర్ చేసుకున్నాడు. ఇదే సందర్భంలో మిక్కీ తన భార్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేయదనే కాకుండా తన భార్య పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ ను చేసాడు.

తన భార్య ఒక అమెరికన్ అని అంటూ ఒకసారి పార్టీలో ఆమెను తాను కలిసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆమె తనకు తగిన అమ్మాయి అనిపించి ఆమె దగ్గరకు వెళ్ళి ‘నన్ను పెళ్ళి చేసుకుంటావా... అని అడిగి ఆమెకు షాక్ ఇవ్వడమే కాకుండా నెలరోజులు ఆమెను వెంటాడి తాను పెళ్ళి చేసుకున్న విషయాన్ని బయట పెట్టాడు మిక్కీ జే మేయర్. 

అయితే తన పెళ్ళికి ముందు ఎటువంటి డేటింగ్ వ్యవహారాలూ లేవు అని అంటూ అటువంటి విషయాలు తనకు నచ్చవు అని షాకింగ్ కామెంట్స్ చేసాడు మిక్కీ. ఇదే సందర్భంలో తాను  అందరకీ నచ్చే విధంగా ఎలా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నానో తనకే తెలియదు అని తన దృష్టిలో సంగీతం దేవుడు ఉచ్చిన వరం అని అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తాను తెలుగు సినిమా మ్యూజిక్ ను ఎక్కువగా వినను అని చెప్పే మిక్కీ అచ్చమైన తెలుగు సంస్కృతిని ప్రతిబింబిoచే పాటలకు సంగీత దర్శకత్వం వహించడం యాదృచ్చికం అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: