"బ్రహ్మోత్సవం’ సినిమా పై కనీవినీ ఎరుగని స్థాయిలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారం వెనుక ఒక ప్రతీకార కుట్ర దాగుంది అంటూ మహేష్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. ఆమధ్య ‘ బ్రహ్మోత్సవం’ విడుదలకు ముందు ఆ సినిమాకు ఒక ప్రముఖ యంగ్ హీరో తండ్రి తన కొడుకు సినిమాకోసం థియేటర్స్ సమస్య సృష్టిస్తున్నాడు అంటూ వెబ్ మీడియాలో మహేష్ అభిమానులు చేసిన కామెంట్స్ కు మనసులో పెట్టుకుని ఆ టాప్ యంగ్ హీరో అభిమానులు పనిగట్టుకుని ‘బ్రహ్మోత్సవం’ పై మితిమీరిన స్థాయిలో విషప్రచారం చేస్తున్నారు అంటూ మహేష్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు.

కొంతమంది నెటిజన్స్ అయితే మరో అడుగు ముందుకువేసి తమకు ఎవరైనా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఫోన్ నెంబర్ చెబితే  తాము ఈసినిమా చూసినందుకు అయిన ఖర్చయినడబ్బుకు సరిపడా తిట్లయినా తిట్టాలని ఉంది అంటూ సెటైర్లు పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు మరికొంత మంది అయితే తెలుగు సినిమా డైరెక్టర్లకు ప్రేక్షకులంటే గౌరవం లేదు, జాలీ లేదు, కనీసం  ఏంతీస్తున్నామన్న ధ్యాసలేదు, కనీసం ఏమితీయాలన్న  జ్ఞానంలేదు అంటూ ఘాటైన కామెంట్స్ పెడుతున్నారు. 

 మరికొందరు అయితే మహేష్ మిల్క్ బోయ్ కాన్సెప్ట్  మారిపోయి ‘బ్రహ్మోత్సవం’ సినిమా తరువాత బాబోయ్ మహేష్ మూవీ అనే విధంగా  మారిపోయాడు అంటూ మరో వాదనను తెరపైకి తీసుకు వస్తునారు. అంతేకాదు కథ ఎంత గొప్పదైనా కథనం ముఖ్యమన్న బేసిక్ సూత్రాన్ని గాలికొదిలేసిన ఘనత శ్రీకాంత్ అడ్డాలది అంటూ  ఏడుతరాల గురించి సినిమా తీసిన తరువాత కనీసం యూనిట్ సభ్యులు నలుగురయినా కూర్చుని బాధ్యతాయుతంగా ప్రివ్యూ చూసుకుని ఉంటే  ఈపరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు అంటూ మహేష్ ఆలోచనలు గాడి తప్పాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. 

మరికొందరు అయితే శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవానికి చక్రస్నానం చేయించాడు అంటూ వస్తున్న ఈకామెంట్స్ రేపటి నుంచి ఈకలెక్షన్స్ పై భారీ ప్రభావాన్ని చూపెడితే తమపరి స్థితి ఏమిటి అని ఈసినిమాను భారీ ఎమౌంట్స్ కి  కొనుక్కున్న  బయ్యర్లను పీడిస్తోంది అని టాక్. ఏమైనా మహేష్ కు  పీడకలలా ‘బ్రహ్మోత్సవం’ మారింది.. 





మరింత సమాచారం తెలుసుకోండి: