హీరో  రామ్ కూడ చాలా మంది యంగ్ హీరోలలా తరుచు వెబ్ మీడియాలో సందడి చేస్తూ అనేక ఆసక్తికరమైన విషయాల పై కామెంట్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ యంగ్ హీరో మొన్న జూనియర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల అయిన జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో  రాబోతున్న మూవీ ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

‘జనతా గ్యారేజ్’ కి సంబంధించి లోగో డిజైన్ బాగుందని అందరూ కామెంట్ చేస్తూ ఉంటే ఈ సినిమా టైటిల్ కింద రాసిన క్యాప్షన్. 'ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును' అన్న పదాలను మారిస్తే బాగుంటుంది అంటూ ఎనర్జిటిక్ హీరో రామ్ ఒక ట్వీట్ చేశాడు. అలాగని ఈ కేప్షన్ తనకు నచ్చలేదని కాదు అని అంటూ రిలీజ్ అయిన తర్వాత రికార్డులు బద్దలవ్వాలనే కోరికతో  తాను ఇలా చెపుతున్నాను అంటూ అందరికీ షాక్ ఇచ్చాడు రామ్. 

అతడు చేసిన ట్విట్ ఇలా ఉంది ‘జనతా గ్యారేజ్ కేప్షన్ ఇచ్చట అన్ని రికార్డులు సెట్ చేయబడును అన్న పదాలు రిలీజ్ తర్వాత మారాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్’ అని ట్వీట్ చేశాడు రామ్. అయితే రామ్ ఈవిధంగా తమ అభిమాన హీరో సినిమా ఫస్ట్ లుక్ పై ఎందుకు ఇలా ట్విట్ చేసాడు అంటూ జూనియర్ అభిమానులు రామ్ ట్విట్ వెనక అర్ధాలను విశ్లేషణలు చేస్తున్నారు. 

ఇప్పటివరకూ తను చేసిన రెండు సినిమాలతోను ప్రభాస్ మహేష్ లకు కెరీర్ బెస్ట్ రిజల్ట్స్ ఇచిన కొరటాల శివ జూనియర్ కు కూడ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడు అని తాము ఆలోచిస్తూ ఉంటే ఇటువంటి కామెంట్స్ రామ్ ఎందుకు చేసాడు అని జూనియర్ అభిమానుల వాదన. ఆగష్టులో విడుదల కాబోతున్న ఈసినిమా పై భారీ అంచనాలు ఉన్న నేపధ్యంలో ఏకంగా రామ్ ఈసినిమా ట్యాగ్ లైన్ ఎందుకు మార్చేయమన్నాడు అన్నది టాలీవుడ్ విశ్లేషకులకు కూడ అంతు చిక్కని ప్రశ్నగా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: