క్రియేటివిటీ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం సుకుమార్. అతడి ఆలోచనలే కాదు అతడు సృష్టించే పాత్రలు కూడ చాల డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ మాస్టారి బుట్టలో టాప్ హీరోలు పడిపోతూ ఉంటారు. ఈ సంక్రాంతికి జూనియర్ ఎన్టీఆర్ కు “నాన్నకు ప్రేమతో” వంటి అద్భుతమైన సినిమాను అందించిన సుకుమార్ ఆ సినిమా థీమ్ ను ఒక గడియారంగా మలిచి జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు కానుకగా అందజేశాడు. 

ఆ సినిమాలో ‘జూనియర్ ఎన్టీఆర్’ పాడిన ‘ఫాలో ఫాలో’ పాటను గుర్తు చేసే విధంగా సమయాన్ని ఫాలో అవ్వాలని సూచిస్తూ ఆ సినిమాలోని  బటర్ ఫ్లై థీరిని గుర్తుకు చేస్తూ ఈ గడియారంలో కూడ బటర్ ఫ్లై ను ఉంచాడు సుకుమార్. అదేవిధంగా ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో విలన్ కు హీరోకు మధ్య నడిచిన ‘మైండ్ గేమ్’ బాల్స్ ను కూడా పెట్టి ‘గేమ్ ఓవర్’ అంటూ సుకుమార్ అందించిన ‘బహుమతి’కి జూనియర్ జోష్ లోకి వెళ్ళిపోవడమే కాకుండా ఆ గడియారం ఫోటోను జూనియర్ తన ట్విటర్ లో పెట్టాడు. 

“ఇంతవరకు నా పుట్టినరోజుకు ఇటువంటి ప్రత్యేకమైన కానుకను అందుకోలేదు థాంక్స్ సుకుమార్ గారు” అంటూ జూనియర్ తన భావాలను సుకుమార్ కు తెలియచేయడమే కాకుండా ఆ గడియారం ఫోటోను తన అభిమానులకు ఎంతో మురిపంగా షేర్ చేసాడు జూనియర్. ప్రస్తుతం సుకుమార్ జూనియర్ కు అందించిన ఈ బహుమతి వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 

ఇది ఇలా ఉండగా సుముమార్ ప్రస్తుతం రామ్ చరణ్ కోసం తయారు చేస్తున్న సినిమా స్క్రిప్ట్ లో ఒక ఫిజిక్స్ థీరీ ఉంటుందని టాక్. దాదాపు 75 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సంవత్సరాంతంలో ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను స్వయంగా రామ్ చరణ్ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కాని వారి సొంత బ్యానర్ పై నిర్మిస్తారు అనే వార్తలు కూడ ఉన్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: