‘బ్రహ్మోత్సవం’ సినిమా ఫెయిల్ అవడంకన్నా ఆ సినిమా పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ మహేష్ ను చాలబాధ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు డివైడ్ టాక్ వస్తుందని ఈసినిమా ఫైనల్ అవుట్ పుట్ చూసిన తరువాత మహేష్ కు అనుమానం వచ్చినా ఇంత ఘోరమైన నెగిటివ్ టాక్ ఈ సినిమాకు సంబంధించి వస్తుందని మహేష్ ఏ మాత్రం ఊహించలేకపోయాడు అని టాక్. 

ఈసినిమా ఒక డిఫరెంట్ ఫ్యామిలీ వేల్యూస్ తో ఉన్న కథ అని ముందు నుంచి పబ్లిసిటీ చేయడం ద్వారా ఈ సినిమాకు ఉన్న నెగిటివ్ పాయింట్స్ నుండి బయట పడవచ్చు అని మహేష్ బావించాడు. కనీసం తన అభిమానులకు కూడ అర్ధంకాని భయంకరమైన ఫ్లాప్ గా ఈ సినిమా మారుతుందని మహేష్ ఏ మాత్రం ఊహించలేదు అన్న వార్తలు కూడ ఉన్నాయి. 

శ్రీకాంత్ అడ్డాల కధ కన్నా అతది ఐడియాలజీని టేకింగ్ ను నమ్మిన మహేష్ ఈసినిమాకు కథ విషయంలో సపోర్ట్ ఇవ్వడానికి, పరుచూరి, గణేష్ పాత్రో, శ్రీరమణ లాంటి హేమాహేమీలను రంగంలోకి దింపినా ప్రయోజనం లేకపోవడం మహేష్ కు తట్టుకోలేని షాక్ గా మారింది అని టాక్. గతంలో మహేష్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమా ఘోరమైన ఫ్లాప్ గా మారినా ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. 

అయితే ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’ అటు అభిమానులను కాని ఇటు విమర్శకులను కాని మెప్పించలేకపోయిన సినిమాగా మారడం మహేష్ కు మింగుడు పడటం లేదు అని టాక్. ఈ వార్తలు ఇలా ఉండగా నిన్న ఆదివారం మహేష్ కు సూపర్ సన్ డేగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ప్రదర్శింప బడుతున్న మన ఇరు రాష్ట్రాలలోని చాల ధియేటర్లు నిన్న హౌస్ ఫుల్ కలక్షన్స్ తో కనిపించడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. ఈసినిమా ఈ నెగిటివ్ టాక్ నుండి బయట పడుతుందా అనే ఆశ కూడ ఈసినిమా బయ్యర్లలో ఏర్పడింది. ఈసినిమా టాక్ ఎలా ఉన్నా ఇప్పటికే ఈసినిమాకు అమెరికాలో 1 మిలియన్ డాలర్ల కలక్షన్స్ రావడమే కాకుండా ఖచ్చితంగా 2 మిలియన్ డాలర్ల సినిమాగా ‘బ్రహ్మోత్సవం’ మారుతుంది అన్న ఆశలో ఉన్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: