జూనియర్ ఎన్టీర్ మీడియాకు ఎంత దగ్గర కావాలని ప్రయత్నాలు చేస్తూ భారీ పార్టీలు ఇస్తున్నా జూనియర్ మీడియాకు దగ్గర కాలేక పోతున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా గతవారం జరిగిన జూనియర్ పుట్టిన రోజును ఉదాహరిస్తున్నారు. సామాన్యం గా ఛానల్స్ ఒక టాప్ హీరో పుట్టిన రోజు వచ్చిందంటే చాలు ఏదో విధమైన ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ఊదరకొడతాయి.

అదేవిదంగా ప్రముఖ పత్రికలు కూడ ఒక టాప్ హీరో పుట్టినరోజును పురస్కరించుకుని ఆ హీరోతో ప్రత్యేక ఇంటర్వ్యూలు ప్రచురిస్తూ ఉంటాయి. అయితే ఈ హడావిడి ఏమిలేకుండ జూనియర్ పుట్టినరోజు గత వారం  గడిచిపోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. మరో ముఖ్య విషయం ఏంటంటే జూనియర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయబడ్డ ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్ సంబంధించిన వార్తలు చాలా ఛానల్స్ తమ సినిమా న్యూస్ లో ప్రసారం చేయక పోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. 

‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్ కి జూనియర్ అభిమానులలో విపరీతమైన స్పందన వచ్చినా ఆ వార్తలకు మీడియాలోని కొన్ని వర్గాలు ప్రాముఖ్యత ఇవ్వక పోవడం ప్రస్తుతం టాపిక్ అఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇప్పటికే తెలుగు దేశంపార్టీ లో జూనియర్ ప్రభావాన్ని చాలా వ్యూహాత్మకంగా తగ్గిoచి వేసిన నేపధ్యంలో జూనియర్ ను మీడియాలోని కొన్ని వర్గాలు పట్టించుకోక పోవడం వెనుక కూడ ఏదైనా వ్యూహం ఉందా అన్న చర్చలు జరుగుతున్నాయి. 

ఈ సంవత్సరం ఇప్పటి వరకు విడుదలయిన టాప్ యంగ్ హీరోల  సినిమాలలో అల్లు అర్జున్ ‘సరైనోడు’ తప్పిచి అన్ని బాక్సాఫీస్ దగ్గర చతికల పడటంతో ప్రస్తుతం టాలీవుడ్ దృష్టి ఆగష్టులో రాబోతున్న జూనియర్ ‘జనతా గ్యారేజ్’ పై ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని 100 కోట్ల కలెక్షన్స్ దాటినప్పుడు మాత్రమె జూనియర్ స్థాయి నిరూపింప బడుతుంది. అoదువల్లనే ఎట్టి పరిస్తుతలలోను ఈ ‘జనతా గ్యారేజ్’ ని బ్లాకు బస్టర్ హిట్ గా మార్చడానికి జూనియర్ తెగ టెన్షన్ పడిపోతున్నాడు అనే కామెంట్స్ ఉన్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: