తెలుగు ఇండస్ట్రీలోకి వారసత్వపు హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ‘మురారి’ చిత్రంతో మంచి ఇమేజ్ సంపాదించారు. తర్వాత వచ్చిన పోకిరి తో తెలుగు సినిమాల రికార్డులు బద్దలు కొట్టారు.తర్వాత వచ్చిన దూకుడు సినిమాతో మరింత దూకుడు పెంచారు. గత సంవత్సరం శ్రీమంతుడు చిత్రంతో సోషల్ మెసేజ్ తో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నారు. ఇక ఫ్యామిలీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం నిన్న ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయ్యింది. 


బ్రహ్మోత్సవం చిత్రంలో మహేష్ బాబు, సమంత


విడుదలైన అన్న చోట్ల మొదటి రోజే ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వచ్చింది. మహేష్ బాబు ఫ్యాన్స్ కోరుకున్న ఎలిమెంట్స్ ఏవీ లేకపోవడంతో బాగా నిరాశకు లోనయ్యారు. అంతే కాదు ఈ చిత్రంలో శ్రీకాంత్ అడ్డాల చెప్పాల్సిన థీమ్ ఎవ్వరికీ అర్ధం కాలేదట. సినిమా మొత్తం హీరో గారి బంధువుల చుట్టూ తిరగడమే ఉందట. దీంతో అనుకున్న స్థాయిలో ఈ చిత్రం ఆడలేకపోయింది.


బ్రహ్మోత్సవం పోస్టర్


ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కాజల్, సమంత, ప్రణీత నటించారు. ఇక సినిమా మొత్తం పెద్ద తారలతో నిండిపోయి సందడిగా ఉందట. మిక్కీజే మేయర్ సంగీతం పెద్దగా ఆదుకోలేక పోయిందని టాక్. ఏది ఏమైనా మహేష్ బాబు రికార్డు బ్రేక్ చేస్తాడని ఊహించిన వారికి నిరాశే మిగిలిందట. ప్రిన్స్ మహేష్‌బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం తొలిరోజు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది కానీ.. రెండోరోజు మాత్రం చతికిలపడిపోయింది. ఫస్ట్‌డే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.12.71 కోట్లు వసూలు చేసిన మూవీ.. రెండో రోజు కేవలం రూ.3.12 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. దీంతో.. మొత్తం రెండురోజుల్లో ఈ మూవీ కలెక్షన్స్ రూ.15.83 కోట్లు అన్నమాట.  


బ్రహ్మోత్సవం ఫస్ట్ డే ఏరియా వైజ్ కలెక్షన్లు :


నైజాం        : 4.74 కోట్లు


సీడెడ్        : 1.93  కోట్లు


వెస్ట్ గోదావరి   : 1.87 కోట్లు


వెస్ట్ గోదావరి   : 2.10 కోట్లు


గుంటూరు    : 2.17 కోట్లు


వైజాగ్              : 1.40  కోట్లు


కృష్ణా            : 1.02 కోట్లు


నెల్లూరు         :  0.60 కోట్లు


టోటల్ ఏపి + తెలంగాణ   : రూ.15.83 కోట్లు



మరింత సమాచారం తెలుసుకోండి: