తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబుకి  పోకిరి చిత్రంతో మాస్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. తర్వాత వచ్చిన దూకుడు చిత్రంలో యాక్షన్, కామెడీ, సాంగ్స్ అన్నీ బాగా కలిసి రావడంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. గత సంవత్సరం కొరటాల దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ చిత్రంతో అద్భుత విజయం సాధించారు..ఇక మహేష్ బాబు తదుపరి చిత్రాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతాయని అనుకున్న సమయంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు..విడుదలైన అన్ని కేంద్రాల్లో మిశ్రమ స్పందన రావడంతో సినిమాపై అంచనాలన్నీ తలకిందులయ్యాయి..అయితే మహేష్ బాబు కి ‘మే’ నెల అస్సలు కలిసి రాదట..గతంలో  తన కెరీర్ లో రెండు భయంకరమైన అపజయాలు చవి చూసిన తర్వాత కూడా మరోసారి ఇదే నెలలో ఆ సినిమా విడుదల చేసి మరోసారి అపజయాన్ని కొని తెచ్చుకున్నారని ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారట.

బ్రహ్మోత్సవం పోస్టర్


గతంలో మహేష్ బాబు నటించిన ‘నిజం’ చిత్రం మే 23 , 2003 లో, ‘నాని’ చిత్రం మే 14న , 2004 లో  రిలీజ్ అయి రెండు కూడా ఘోర పరాజయం పొందాయి. ఇక మే 20, 2016  రోజున ఎన్నో అంచనాలతో ‘బ్రహ్మోత్సవం’ థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసిన ఫ్యాన్ అప్పుడే భయపడ్డారట. మహేష్ బాబు కి కలిసి రాని ‘మే’ నెలలో ఈ సినిమా రిలీజ్ చేస్తే మరోసారి డిజాస్టర్ గా మిగిలిపోతుందని కొంతమంది సలహాలు కూడా ఇచ్చార..కానీ ఇవన్నీ దాటుకొని బ్రహ్మోత్సవం చిత్రం విడుదల చేయడం..అది కాస్త మిశ్రమ స్పందన రావడం కొన్ని చోట్లు అట్టర్ ప్లాప్ అని టాక్ రావడం ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేసింది.

సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాన్ 


ఆ మద్య పవన్ కళ్యాన్ కి కూడా ఏప్రిల్ నెల అస్సలు అచ్చిరాలేదట..గతంలో ఏప్రిల్ లో తీసిని సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయట..మరోసారి అదే నెలలో ఎన్నో అంచనాల మద్య వచ్చిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద బోర్లాపడింది. సినిమా రంగం సెంటిమెంట్ రంగం కాబట్టి అందునా ఫలానా సమయంలో వచ్చిన ఫ్లాప్ అంటే భయపడిపోతారు అందుకే మహేష్ ఫ్యాన్స్ మే నెలలో బ్రహ్మోత్సవం రిలీజ్ అనగానే ఆశలు వదులుకున్నారు. నిజంగానే ఫ్యాన్స్ భయపడ్డట్టు ‘బ్రహ్మోత్సవం’ మహేష్ కెరీర్ లో అపజయ చిత్రంగా మిగిలిపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: