తమిళ,తెలుగు ఇండస్ట్రీలో హీరో సూర్య అంటే ప్రత్యేక అభిమానం ఉంది. గజిని చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సూర్య తర్వాత సింగం, సింగం 2 చిత్రాలతో బాగా ఆకట్టుకున్నారు. రీసెంట్ గా వచ్చిన ‘24’ చిత్రం కూడా సూప్ డూపర్ హిట్ అయ్యింది..అంతే కాదు ఈ చిత్రం తెలుగు  రాష్ట్రాలో సూర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిపోవడమే కాకుండా భారీ కలెక్షన్లు కూడా రాబట్టింది. ఇక సూర్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చాలా మృదు స్వభావిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు మీడియా పరంగా కూడా ఎలాంటి వివాదాస్పద విషయాల్లో లేకపోవడమే ఆయన మంచితనం ఎలాంటిదో తెలిసిపోతుంది. అలాంటి సూర్య కి కోపం వచ్చిందట..అంతే కాదు తన గురించి తప్పుడు రాతలు రాసిన ఓ పత్రికను ఏకిపడేశారట.

తమిళ చిత్రాలకు మలేషియాలో మంచి ఆదరణ ఉన్న విషయం తెలిసిందే..ఎందుకంటే అక్కడ తమిళ సంతతికి చెందిన వారు చాలా మంది ఉన్నారట. అంతే కాదు ప్రతియేట తమిళ సెలబ్రెటీలు అక్కడకు వెళ్లి కల్చరల్ యాక్టివిటీస్‌లో పాల్గొంటూ ఉంటారు. ఈ మద్య ఓ రెలీజియస్ ఆర్గనైజేషన్ తమ కార్యక్రమంలో పాల్గొనడానికి సూర్యను ఆహ్వానించిందని అందుకోసం సూర్య భారీ ఎత్తున డబ్బులు డిమాండ్ చేశారని ఓ మలేషియన్ పత్రిక తప్పుగా ప్రచురించింది.

ఈ విషయం కాస్త సూర్యకు తెలియడంతో అగ్గిలంమీద గుగ్గిలం అయ్యాడట..సదరు పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేశాడట..అంతే కాదు ఆ పత్రికకు వార్నింగ్ ఇస్తూ ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశాడు. తాను ఒక ఆర్టిస్టునని.. మతపరమైన కార్యక్రమాల్లో తాను ఎప్పుడూ పాల్గొనని పేర్కొన్న సూర్య.. మలేషియాలో ఏ సంస్థ తనని ఆహ్వానించలేదని చెప్పాడు. తన గురించి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురిస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారట. జనాలు ఇలాంటి వార్తలను నమ్మొద్దని సూచించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: