బూతు సినిమాల దర్శకుడుగా పేరు గాంచిన మారుతి ప్రస్తుతం తన పై ఉన్న ఆ బూతు ఇమేజ్ నుంచిబయటకు రావడానికి డిఫరెంట్ సినిమాలను తీయడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే డబుల్ మీనింగ్ డైలాగ్స్ తన సినిమాలలో పెట్టే విషయంలో ముందు వరసలో ఉండే మారుతికి నిన్న జరిగిన ‘జెంటిల్ మేన్’ ఆడియో ఫంక్షన్ లో ఆ ఫంక్షన్ యాంకర్ అడిగిన చిలిపి ప్రశ్నకు అదిరిపోయాడు. 

యాంకర్ శ్రీముఖి ఈ కార్యక్రమాన్ని చాల డిఫరెంట్ గా నడిపిద్దాం అన్న ఉద్దేశ్యంతో  ఈసినిమాకు సంబంధించిన ఒక రొమాంటిక్ సాంగ్ విడుదల తరువాత యాంకర్ శ్రీముఖికి ఓ చిలిపి ఆలోచన వచ్చి వరసగా ఆ కార్యక్రమానికి వచ్చిన సెలబ్రిటీలను అందరినీ తమ లైఫ్ లో రొమాంటిక్ మూమెంట్స్ గురించి అడగమని తన తోటి యాంకర్ రవిని రెచ్చగొట్టింది.

దీనితో యాంకర్ రవి మైక్ పుచ్చుకుని ఆ ఆడియో ఫంక్షన్ కు వచ్చిన  అల్లరి నరేశ్, రాణా, అవసరాల ఇలా కొందరిని ఇబ్బంది పెట్టాక చివరికి మారుతి దగ్గరకు వచ్చాడు. యాంకర్ రవి అడిగిన రొమాంటిక్ మూమెంట్స్ ప్రశ్నకు షాక్ అయిన మారుతి తిరిగి ఆయాంకర్ కు గట్టి క్లాస్ పీకాడు.  ‘అసలు మీరడుగుతున్న ప్రశ్నలేంటి? ఇలా ఇంతమంది ముందు ఎవరైనా రొమాన్స్ గురించి అడుగుతారా? ఎవరైనా చెప్పగలుగుతారా?' అన్న మారుతి రవిని రమ్మని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని నీ రొమాన్స్ గురించి చెప్పు ఎప్పుడు చేశావ్? ఎవరితో చేశావ్? ఎన్నిసార్లు చేశావ్? అంటూ ప్రశ్నలు వేసేసరికి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న యాంకర్లకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. 


అయితే అంతలోనే తేరుకున్న ఆ యాంకర్ రవి ఎదో సమాధానం ఇస్తూ ఉంటే అందులో మారుతికి డబల్ మీనింగ్ కనిపించి 'ఇక చాలు.. ఇప్పటికే చాలా అర్ధాలు వచ్చేశాయి. వెళ్లి పని చూసుకో ఇలాంటి ప్రశ్నలు అడక్కండి.' అంటూ మారుతి తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. ఈవిషయాన్ని అంతా పరిశీలిస్తున్న ఆకార్యక్రమానికి వచ్చిన అతిధులు మాత్రం మారుతి పూర్తిగా మారిపోయాడు డబుల్ మీనింగ్ డైలాగులు అంటే చిర్రెత్తి పోతున్నాడు అంటూ మారుతి పై సెటైర్లు వేసినట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: