‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఘోర పరాజయం తరువాత రిలాక్స్ కావడానికి తన అత్తవారింటి దారిపట్టిన పవన్ తన రెస్ట్ ను పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరినట్లుగా వార్తలు వస్తున్నాయి. జూన్ రెండవ తారీఖు నుండి పవన్ తన లేటెస్ట్ సినిమాను దర్శకుడు ఎస్.జె. సూర్య దర్శకత్వంలో సెంటిమెంట్ రీత్యా పొల్లాచ్చి లో మొదలు పెడుతున్న సంగతి తెలిసిందే. 

పవన్ న్యూ లుక్ గురించి ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చాయి. అంతేకాదు పవన్ తన న్యూ లుక్ తో ‘అ ఆ’ ఆడియో ఫంక్షన్ కు కూడ వచ్చాడు.  అయితే పవన్ తన న్యూ లుక్ ను పూర్తిగా మార్చి వేసుకున్న ఫోటో ఒకటి ఇప్పుడు వెబ్ మీడియాలో హడావిడి చేస్తోంది.

అయితే పవన్ న్యూ లుక్ పవన్ వీరాభిమానులకు ఏ మాత్రం నచ్చలేదు అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫలితంతో మైండ్ బ్లాంక్ అయిన పవన్ వీరాభిమానులకు పవన్ న్యూ హెయిర్ స్టైల్ ఏ మాత్రం బాగుండటం లేదు అని పవన్ వీరాభిమానులే తమలో తాము కామెంట్ చేసుకుంటున్నట్లు టాక్.   

‘సర్దార్’ ఘోర పరాజం తరువాత పవన్ కు కొన్ని నమ్మకాలు కూడా  బాగా ఎక్కువై పోయాయి అన్న వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం పవన్ హైదరాబాద్ లోని తన ఇంటికి ఒక ప్రముఖ జ్యోతిష్కుడు ఇచ్చిన సలహాతో రిపేర్లు కూడ చేయిస్తున్నాడని పవన్ కు ఈ హెయిర్ స్టైల్ లుక్ ఎంత వరకు ప్రయోజనం కలిగిస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: