ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం బ్రహ్మోత్సవం. ప్రస్తుతం బ్రహ్మోత్సవం మూవీ థియోటర్స్ లో హల్ చల్ చేస్తుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఫీడ్ బ్యాక్ మాత్రం బయటకు పూర్తి నెగిటివ్ గా వస్తుంది. సినిమా ఎలా ఉన్నది? అని అడిగేలోపు...చాలా దారుణం అనే మాట.. అందరి నుండి వినిపిస్తుంది. ఇందుకు కారణం ఏమిటి? మహేష్ బాబు చేసిన మిస్టేక్స్ ఏమిటి? అన్న దానిపై కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి.


మహేష్ బాబు ఎప్పుడైతే శ్రీమంతుడు మూవీ భారీ సక్సెస్ తరువాత, ఓవర్ కాన్ఫిడెంట్ తో బ్రహ్మోత్సవం మూవీ కథని ఒప్పుకున్నాడో, అప్పటి నుండి ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్రహ్మోత్సవం మూవీపై నెగిటివ్ టాక్స్ స్టార్ట్స్ అయ్యాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో నెగిటివ్ టాక్స్ ఎందుకు స్టార్ట్ అయ్యాయి అంటే... బ్రహ్మోత్సవం కథని డైరెక్టర్ సరిగా డీల్ చేయలేడు...కానీ మహేష్ బాబు ఏ విధంగా శ్రీకాంత్ అడ్డాలని నమ్మాడు అనే టాక్స్ వినిపించాయి.


అలాగే బ్రహ్మోత్సవం మూవీలో మహేష్ బాబు భారీ ఇన్వెస్ట్ చేయటంతో, రెమ్యునరేషన్ ఎక్కువుగా తీసుకుంటున్నాడంటూ కొన్ని రకాల నెగిటివ్ టాక్స్ మార్కెట్ల్ లోకి ఎక్కువుగా వచ్చాయి. అలాగే బ్రహ్మోత్సవం మూవీ ఆడియో ఫంక్షన్ అనంతరం, భారీ పబ్లిసిటీతో తను చేసిన సమాజసేవ కార్యక్రమాలపై పాజిటివ్ టాక్స్ కంటే నెగిటివ్ టాక్స్ ఎక్కువుగా వచ్చాయి. ఇవన్నీ అటుంచితే..మహేష్ బాబు షూటింగ్ సమయంలో ఆర్టిస్ట్ లపై కొంత విసుక్కున్నాడనే టాక్స్ సైతం బయటకు వచ్చాయి.


ఇలా బ్రహ్మోత్సవం మూవీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుండి...రిలీజ్ వరకూ ఏ సందర్భంలో అయినా నెగిటివ్ టాక్స్ చుట్టుముడుతూనే ఉన్నాయి. వీటన్నింటిని మహేష్ బాబు పట్టించుకోకుండా...కేవలం మూవీపైనే దృష్టి పెట్టడంతో...ఆ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవం రిలీజ్ రోజున బయటకు వచ్చిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: