ప్రిన్స్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం రిలీజ్ అయిన ప్రతీ చోట రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది. రిలీజ్ రోజు నుండి నేటి వరకూ అన్ని థియోటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో బ్రహ్మోత్సవం ప్రదర్శన జరుగుతుంది. అయితే ఈ మూవీని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం కొంత నష్టాలను చూసే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ముందుగా ఓవర్సీస్ లో ఈ మూవీ సంచలన రికార్డ్ ని క్రియేట్ చేసింది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ప్రిన్స్ మూవీకి భారీ కలెక్షన్స్ వస్తాయి.


మహేష్ నటించిన ఐదు సినిమాలు యూఎస్ బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ కలెక్షన్స్ సాధించాయి. ఇప్పుడు వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ కూడా 1 మిలియన్ డాలర్ మార్క్‌ ను దాటింది.  అయితే ఇది మహేష్ కి రికార్డ్ ని తీసుకురాగా, ఆ మూవీని కొన్ని డిస్ట్రిబ్యూటర్ కి మాత్రం లాభాలను తీసుకురాలేకపోవచ్చు అని అంటున్నారు. అలాగే డొమెస్టిక్ మార్కెట్ లోనూ బ్రహ్మోత్సవం మూవీ భారీ రికార్డ్స్ ని సొంతం చేసుకుంటుంది.


ఇప్పటి వరకూ ఏ మూవీకి సొంతం కాని ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని, బ్రహ్మోత్సవం మూవీ సొంతం చేసుకుంది. అయితే లాంగ్ రన్ లో మాత్రం బ్రహ్మోత్సవం మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఆశించినంత ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. చాలా చోట్ల భారీ రేటుకి కొన్ని డిస్ట్రిబ్యూటర్స్ కి కొంత మేర నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందని అంటున్నారు.


బ్రహ్మోత్సవం మూవీకి భారీగా నెగిటివ్ పబ్లిసిటీ రావటమే ఇందుకు కారణం అని అంటున్నారు. అయితే ప్రస్తుతం కలెక్షన్స్ వేటలో ఉన్న ఈ మూవీ, మొదటి వారాంతరం కలెక్షన్స్ తరువాతనే, ఎవరికి ఎంత నష్టాలు అనే విషయం బయటకు రానుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: