ఏ హీరో అయినా తన దర్శకత్వంలో సినిమా చేస్తే ఇక కమర్షియల్ మాస్ హీరో అవ్వాల్సిందే.. మాస్ కే ఊర మాస్ అనిపించే దర్శకుడు బోయపాటి శ్రీను.. మరి అలాంటి దర్శకుడికి బాహుబలి లాంటి కటౌట్ దొరికితే ఎలా ఉంటుంది.. రచ్చ రంబోలే కద.. రికార్డుల చెడుగుడే కదా.. అదే జరుగబోతుంది. యంగ్ రెబల్ స్టార్ అండ్ బ్లాక్ బస్టర్ బోయపాటి కాంబోలో ఓ సినిమా వస్తుంది.


బాహుబలికి ముందు మాన్లీ స్టార్ గా మాస్ ఇమేజ్ సంపాదించిన ప్రభాస్ బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించాడు. ప్రస్తుతం బాహుబలి సెకండ్ పార్ట్ షూట్ లో ఉన్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత రెండు ప్రాజెక్టులకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒకటి రన్ రాజా రన్ దర్శకుడు సుజీత్ ది కాగా మరోటి గీతా కృష్ణ బ్యానర్ లో కృష్ణం రాజు నిర్మిస్తున్న సినిమా.


అయితే బోయపాటి రీసెంట్ గా సరైనోడు సినిమాతో హిట్ అందుకున్నాడు. తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను ప్రభాస్ తోనే సినిమా ఉంటుందని టక్. బోయపాటి ఊర మాస్ కు ప్రభాస్ లాంటి హీరో దొరికితే ఇక ఆ సినిమా రికార్డుల వర్షం కురిపించాల్సిందే.  


అయితే ఈ కాంబినేషన్ అఫిషీయల్ గా ఎనౌన్స్ కాలేదు.. కాని ఒకవేళ ఇదే కనుక సినిమాకు సిద్ధమైతే కచ్చితంగా ట్రెండ్ సెట్ సినిమా వస్తుందనడంలో సందేహం లేదు. మరి ఈ కాంబోలో సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: