సినిమాలను చూసే ప్రేక్షకుల అభిరుచులు మారిపోతూ ఉండటంతో సినిమా టైటిల్స్ ట్రెండ్ మారుతోంది. దీనితో స్టార్ హీరోలు సైతం కొత్తకొత్త టైటిల్స్ పై ఆశక్తి కనపరుస్తున్నారు. అంతేకాదు హాలీవుడ్ సినిమాల ప్రభావంతో సైన్స్ ఫిక్షన్లపైన దృష్టిపెడుతున్నారు. హీరో రాంచరణ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్లో త్వరలో ప్రారంభంకాబోతున్న సినిమాకు ‘ఫార్ములా ఎక్స్’  అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. 

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న శంకర్ రజని సినిమా ‘రోబో 2.0’ కూడ సైన్స్ నేపథ్యంగా సాగే సినిమా అన్న విషయం తెలిసిందే. ఇటీవల వచ్చిన సూర్యమూవీ ‘24’ కూడ సైన్సు నేపధ్యంగా అల్లిన కధ కావడం ఆసినిమాకు కూడ మంచి పేరు రావడంతో ఇప్పడు చరణ్ కూడ అదే రూట్ ను ఎంచుకున్నట్లు టాక్.  
ప్రస్తుతం సుకుమార్ ఈ సినిమా కధకు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దుతున్నట్లు టాక్.  

ఒక వైపు డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా స్టోరీకి తుది మెరుగులు దిద్దుతూ ఈ సినిమా నిర్మాణానికి సంబంధించిన  టెక్నికల్ క్వాలిటీస్ పై దృష్టి పెట్టినట్లు టాక్. దాదాపు 75 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాను చిరు బర్త్ డే ఆగస్టు 22న ప్రారంభం అవుతుంది అని టాక్.

ప్రస్తుతం చరణ్, సురేందర్ రెడ్డి డైరెక్షన్లో నటిస్తున్న ‘ధ్రువ' సినిమాను దసరాకు విడుదలచేసి వచ్చే ఏడాది సమ్మర్ రేస్ కు ఈ ‘ఫార్ములా ఎక్స్’  విడుదల చేయాలి అన్న ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సైన్సు ఫిక్షన్ కధలను మాస్ ప్రేక్షకులు పెద్దగా ఆదరించక బోతున్న నేపధ్యంలో చరణ్ సుకుమార్ తో కలిసి మరో సాహసం చేయబోతున్నాడు అనే కామెంట్స్ కుడా ఉన్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: