తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారసత్వపు హీరోగా వచ్చిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు. అంతే కాదు తెలుగు ఇండస్ట్రీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఆ మద్య ‘పోకిరి’ చిత్రంతో రికార్డులు సృష్టించారు.  గత సంవత్సరం ‘శ్రీమంతుడు’ చిత్రంతో సోషల్ మెసెజ్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టేశాడు. టాలీవుడ్ లో నెంబర్ వన్ రేసులో ఉన్న మహేష్ బాబు చిత్రాలపై మంచి క్రేజ్ ఏర్పడ్డ తరుణంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల తో మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రం ‘బ్రహ్మోత్సవం’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అపజయాన్ని అందుకున్నారు.


అయితే మహేష్ కి గత కొంత కాలంగా ఓ సెంటిమెంట్ అచ్చి రావడం లేదట..ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటీ అంటారా..! మహేష్ బాబు తో రెండోసారి దర్శకత్వం వహించడమే.. ఒక్కడు సినిమాను తీసిన గుణ శేఖర్.. ఆ తరువాత అర్జున్ అండ్ సైనికుడు అనే డిజాష్టర్లు తీశాడు. అతడు సినిమా (రిలీజైనప్పుడు యావరేజ్ టాక్ వచ్చింది) తీసిన త్రివిక్రమ్.. ఖలేజా వంటి ఫ్లాప్  చేతిలో పెట్టాడు.


దూకుడుతో మహేష్ రేంజు మార్చిన వైట్ల కూడా ఆగడుతో పెద్ద దెబ్బే వేశాడు. ఇక సీతమ్మ వాకిట్లో సినిమాను తీసిన శ్రీకాంత్ అడ్డాల.. తాను కూడా ఈ లిస్టులోనే చేరతానంటూ ప్రూవ్ చేసుకున్నాడు. బ్రహ్మోత్సవం తో మరోసారి ఫెయిల్యూర్ పొందాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: