సినిమా ఇండస్ట్రీలో అంటే ఓ అద్భుతమై..అందమైన ప్రపంచం అని భావిస్తారు చాలా మంది. కానీ ఆ అందమైన లొకంలో చీకటి కోణాలు, కష్టాలు కన్నీళ్లు ఉంటాయని ఇప్పటి వరకు ఎంతో మంది సినీతారలు విషయాల్లో తెలిసింది. అంతే కాదు ఎంతో లగ్జరీగా బతికి ఒకేసారి కష్టాలు వస్తే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనకు తెలుసు. రీసెంట్ గా నటి పూజిత తన భర్త మరో ఐఏఎస్ ని వివాహం చేసుకున్నాడని వారితో తనకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఇలా కొంత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో వార్తల్లోకి ఎక్కారు.

అపూర్వ 


తాజాగా సినీ నటి అపూర్వ తనకు ప్రాణ భయముందని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కామెడీ, వ్యాంప్ పాత్రలు వేసే అపూర్వ కు ప్రాణహాని ఏంటా అని అనుకుంటున్నారా..! ఇన్‌స్పెక్టర్‌ వహిదుద్దీన్‌ తెలిపిన వివరాల ప్రకారం..సిద్ధార్థనగర్‌లో నివాసముంటున్న అపూర్వ కారును ఈ నెల 21న ఫిలింసిటీ సమీపంలోని చౌటుప్పల్‌ వద్ద మరో కారు ఢీ కొట్టింది దీంతో అపూర్వ కారు పూర్తిగా దెబ్బతిన్నది.

సినీనటి అపూర్వ 


అయితే కారు సెలబ్రెటీది కనుక గొడవ పెద్దది అవుతుందన్న విషయంతో  దెబ్బతిన్న కారు బాగుచేయిస్తామని ఢీ కొట్టిన వారు ఒప్పుకున్నారు. అంతే కాదు కారు రిపేరు పూర్తి అయ్యే వరకు తమ కారును అపూర్వ వద్దే ఉంచారు. ఈ నేపథ్యంలో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అంతే కాక తన ఇంటి సరౌండింగ్ లో కొంత మంది వ్యక్తులు పదే పదే ఇంటి వైపు చూస్తూ తచ్చాడుతున్నారని  ఆమె పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: