తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు వారసత్వపు హీరోల హవా నడుస్తున్న సమయంలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా వస్తూ వస్తూ..సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ వచ్చిన హీరో సంపూర్ణేష్ బాబు. తన మొదటి సినిమా వెరైటీ టైటిల్ ‘హృదయకాలేయం’చిత్రంతో నవ్వులు పూయించిన సంపూర్ణేష్ బాబు తన వెరైటీ డ్యాన్స్,పంచ్ డైలాగ్స్, పేరడీ యాక్షన్స్ తో బాగా సందడి చేశాడు. తర్వాత సింగం 123 చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించి మరోసారి నవ్వించాడు..తాజాగా ఇప్పుడు ‘కొబ్బరిమట్ట’ చిత్రంతో త్రిపాత్రాభినయం చేస్తూ మరోసారి నవ్వుల పువ్వుల పూయించడానికి వస్తున్నాడు. ఈ చిత్రంలో పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. అంతే కాదు సంపూ ఈ చిత్రంలో పాట కూడా పాడారు.

కొబ్బరి మట్ట చిత్రంలో సంపూర్ణేష్ బాబు


గతంలో మోహన్ బాబు నటించిన పెదరాయుడు గెటప్ లో కనిపిస్తూ  ఆడవాళ్ళ గురించి చెప్పిన నాన్‌స్టాప్ డైలాగ్ తో అదరగొట్టాడు. నిజంగా చిన్న 'రేయ్...కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే, పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి, పెరిగేసి ఎదిగేస్తున్న టైం లో తను పుట్టింది తనకోసం కాదు ఎక్కడో పుట్టిన ఎదవ కోసం అన్న విషయం తెలిసాక అమ్మా నాన్నా కలిసి పావుకిలో లడ్డూలూ, అరకిలో చేగోడీలు పెట్టి దున్నపోతులాంటి ఒక పెళ్ళికొడుకుని తీసుకొచ్చి తల దించుకొని పెళ్ళిలో, కళ్ళు దించుకొని శోభనం గదిలో పడుకుంటే గుండెలమీద తాళి బరువు, శరీరం మీద వాడి బరువు మోసీ మోసీ, వాడు వేసిన విత్తనాన్ని తొమ్మిది నెలలు మోసీ మోసి ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చి, ప్రతిరోజూ కోడికంటే ముందే నిద్రలేచి, బొట్టుపెట్టి,వాకిట్లో ముగ్గుపెట్టి, స్టవ్ మీద గిన్నె పెట్టి, అందులో పాలు మరగపెట్టి కాఫీ పొడి,టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళను బడికివెళ్ళగొట్టి నిన్ను ఆఫీస్ కి తరిమికొట్టి..


కొబ్బరి మట్ట చిత్రంలో ఓ దృశ్యం


ఒక చేత రిమోటూ- మరోచేత కత్తిపీట పట్టుకొని ఛానెల్సు మార్చి మార్చి, కూరగాయలు తరిగీ తరిగి, పదకొండుగంటలకు మాఊరి వంట, పన్నెండు గంటలకు స్టార్ మహిళ చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ, కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్ లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి, ముద్దమందారం, ఆడదే ఆధారం, మనసూ మమత, గోకులంలో సీత, స్వాతి చినుకులు అంటూ పగలూ రాత్రి తేడా లేకుండా సీరియల్స్ లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలిసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి, అప్పుడు తిని పడుకుంటుందిరా.... అదిరా ఆడదంటే అలాంటి నీ భార్యని వొదిలేస్తానంటావారా....బ్లడీ ఫూల్' ఇలా మనోడు గుక్కతిప్పుకోకుండా కొట్టే డైలాగ్స్ చూస్తుంటే ఔరా అనిపిస్తుంది. నిజంగా పంచ్ డైలాగ్స్ కొట్టడంలో సంపూర్ణేష్ కి సాటిలేరనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ హల్ చల్ చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: