గత శుక్రవారం విడుదలైన మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ కు మొదటిరోజు మొదటి షో నుండి భయంకరమైన నెగిటివ్ టాక్ రావడంతో ఈసినిమా మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా మారబోతోంది. ఈసినిమాను చూసిన మహేష్ అభిమానులు కూడ రెండవసారి ఈ సినిమాను చూడటానికి సాహసించ లేకపొతున్నారు అంటే ఈసినిమా ఎటువంటి ఫ్లాప్ రికార్డులను సృష్టించిందో అర్ధం అవుతుంది. 

వీక్ ఎండ్ పూర్తి అయిన తరువాత  నిన్న సోమవారం ఇరు రాష్ట్రాలలోను ఈసినిమా ప్రదర్శింపబడుతున్న కొన్ని సెంటర్లలో కనీసం 25% టిక్కెట్లు కూడ ఈసినిమాకు అమ్మక పోవడంతో కొన్ని బిసి సెంటర్లలో ధియేటర్ యాజమాన్యాలు ‘బ్రహ్మోత్సవం’ సినిమాను తీసివేసి నిన్న సోమవారం నుండి డబ్బింగ్ మూవీ ‘బిచ్చగాడు’  చిత్రాన్ని తమ థియేటర్లలో ప్రదర్శించేందుకు ముందుకు రావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. కొందరు మహేష్ విమర్శకులు అయితే ఇది మహేష్ కు మరిచిపోలేని అవమానం అంటూ సెటైర్లు వేస్తున్నారు.  

‘సలీమ్‌' చిత్రంతో మెప్పించిన తమిళ సంగీత దర్శకుడు, నటుడు విజయ్‌ ఆంటోనీ ఈసారి 'బిచ్చగాడు'గా ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ఈసినిమాకు కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడ ఊహించని విజయం రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అతి తక్కువ పెట్టుబడితో కోలీవుడ్ లో నిర్మించిన ఈ ‘బిచ్చగాడు’ కు తమిళ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. మంచి కథలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందన్న నమ్మకంతో తమిళంలో విజయ్ ఆంటోని నటించిన ఈసినిమా  'పిచ్చైకారన్' పేరుతో విడుదలై ఘన విజయం సాధించింది. 


ఈసినిమాను తెలుగులో 'బిచ్చగాడు' పేరుతో డబ్ చేసారు. కొన్ని వేల కోట్ల ఆస్థికి వారసుడైన ఈసినిమా  హీరో తన తల్లిని బ్రతికించుకోవడం కోసం ఒకయోగి సలహాతో బిచ్చగాడిగా మారి పేదరికంలో ఉండే బాధను తెలుసుకునే పాత్రలో విజయ్ ఆంటోని అద్భుతంగా నటించాడని కోలీవుడ్ మీడియా కామెంట్స్ వ్రాస్తోంది. ఏది ఎలా ఉన్నా ఒక డబ్బింగ్ ‘బిచ్చగాడు’ సినిమా ముందు తెలుగు సినిమా టాప్ హీరో ‘బ్రహ్మోత్సవం’ నిలవలేకపోయింది..   



మరింత సమాచారం తెలుసుకోండి: