బుల్లి తెరపై జబర్థస్త్ కామెడీ షోతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హాట్ యాంకర్ రేష్మీ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయంది. తన సీనియర్ అనసూయ కంటే రెండు ఆకులు ఎక్కువే చదివిన ఈ అమ్మడు గతంలో సినిమాల్లో నటించినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఈటీవో జబర్ధస్త్ కామెడీ షో కి అనసూయ గుడ్ బై చెప్పేసిన తర్వాత ఆమె ప్లేస్ లోకి రేష్మీ వెళ్లింది. చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని.. హాట్ లుక్స్ తో చలాకీగా మాట్లాడుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది. రీసెంట్ గా ఈ అమ్మడు గుంటూర్ టాకీస్ చిత్రంలో హాట్ హాట్ గా రెచ్చిపోయి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇక తెలుగు ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ ఆలీ అంటే తెలియని వారు వుండరు. బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆలీకి అంచెలంచెలుగా పైకి వచ్చాడు. ఎస్వీ కృష్ణ రెడ్డి చిత్రంలో హీరోగా కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఆ తరువాత హీరోగా కొన్ని సూపర్ హిట్స్ కొట్టినప్పటికీ కూడా ఆ తరువాత హీరోగా తన కెరీర్ ని అంత గొప్పగా మలచుకోలేదు. ఆ తరువాత మళ్ళీ టాలీవుడ్ లోనే కమెడియన్ గా మారి అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ వచ్చాడు. ఇటీవలే అలీ టాలీవుడ్ లో తన 40 ఏళ్ళ కెరీర్ ని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆలీ వెండి తెరపైనే కాకుండా బుల్లి తెరపై కూడా సందడి చేస్తున్నాడు.


అలీ ఇటీవల చేస్తున్న ప్రోగ్రాం 'అలీతో జాలీ గా' ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ఇప్పటికే మంచి పేరు తెచ్చుకుంది. ఈ ప్రోగ్రాంకి ప్రతి వారం కొంత మంది సినీ ప్రముఖులు వచ్చి ఈ గేమ్ షో లో పోటీ చేస్తారు. అలాగే కొన్ని వారాల క్రితం 'గుంటూరు టాకీస్' మూవీ టీం కూడా అలీతో జాలీగా ప్రోగ్రాంకి వచ్చారు. ఇందులో ఆ చిత్ర దర్శకుడితో పాటు రష్మీ కూడా వచ్చింది.

అయితే తెలుగుపై పెద్దగా అవగాహన లేని రేష్మీ..ఆలీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఈ ప్రోగ్రాంలో నా బెల్ ఎందుకు నొక్కుతున్నావ్ అనడాన్ని రష్మీ మరోలా నాది ఎందుకు పిసుకుతున్నావ్? అనడంతో ఆలీ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. సాధారణంగా డబుల్ మీనింగ్ మాటలతో ఆలీ పంచ్ లు విసురుతుంటే..ఈసారి మాత్రం రేష్మీ ఆ డైలాగ్ కొట్టడంతో అలీకి మైండ్ బ్లాంక్ అయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: