సూపర్ స్టార్ రజనీకాంత్‌ తన వ్యక్తిగత జీవితంలో ఎంతో నిరాడంబరంగా ఉంటాడు అన్న విషయం ఓపెన్ సీక్రెట్. దక్షిణాది సినిమా రంగాన్ని శాసించే రజినీకాంత్ ఇప్పటికీ తాను సినిమాలలో నటించేడప్పుడు తన పాత్రకు సంబంధించిన డైలాగ్స్ రిహార్సల్ చేసుకుంటాడు అంటే ఎవరూ నమ్మరు. అటువంటి సూపర్ స్టార్ ను ఇంటి గుమ్మం ముందు ఎదురు చూస్తూ నిలబెట్టించిన ఒక హీరోయిన్ కు సంబంధించిన వార్తలు ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.

ఆ శక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే మంచి నటిగా హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రాధికా ఆప్టే కోసం రజినీ తన ఇంటి గుమ్మం ముందు నుంచున్నాడు.  దక్షిణాదిలో పెళ్లయిన వారికి సినిమా ఛాన్సులు రావని అంటూ కామెంట్ చేసే రాధిక ప్రస్తుతం రజినీతో ‘కబాలి’ లో నటించినప్పుడు సెట్లో రజినీ వుండే తీరు చూసి మైండ్‌ బ్లాoక్‌ అయింది అని చెపుతోంది. అంత క్రమశిక్షణ ఉన్న నటుడ్ని తాను ఇంతవరకు చూడలేదు అని అంటూ నెలల తరబడి ఒక్కరోజు విరామం లేకుండా ఆయన పనితీరు చూసి తాను షాక్ అయ్యాను అని అంటోంది రాధిక.

ఇదే సందర్భంలో ఒక మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టింది రాధిక. రజినీ కాంత్ ను తాను మొట్టమొదటి సారి కలవడానికి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్లే సరికి రజినీ తనను లోపలికి తీసుకు వెళ్లడానికి గుమ్మం దగ్గర నిలబడి ఉన్న విషయాన్ని బయట పెడుతూ తాను ఆ సంఘటనను ఇప్పటికీ నమ్మలేకపోయాను అంటూ రజినీ పై షాకింగ్ కామెంట్స్  చేసింది రాధిక. 

ఫ్యాషన్ మ్యాగజైన్స్ కు హాట్ ఫోటో షూట్ ను ఇస్తూ నిరంతరం సంచలన వార్తలలో ఉండే రాధిక హీరోల ఆధిపత్యం పై అనేకసార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. కాని అటువంటి రాధిక రజినీకాంత్ పక్కన నిండైన చీరతో చాల సాంప్రదాయంగా కనిపించడమే కాకుండా రజినీకాంత్ ను ఇలా ఆకాశంలోకి ఎత్తేస్తూ కామెంట్స్ చేయడం బట్టి రజినీకాంత్ రాధికను మార్చేసాడా అని అనిపించడం సహజం..



మరింత సమాచారం తెలుసుకోండి: