ఓ సినిమా పోయిందంటే ఆ సినిమా నష్ట నివారణ చర్యలుగా మరో సినిమా చేసేందుకు సిద్ధపడటం నేటి దర్శక నిర్మాతలకు అలవాటుగా మారింది. బ్రూస్ లీ దెబ్బకి భారీ లాస్ ఫేజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కు రాం చరణ్ తను చేస్తున్న ధృవ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇవ్వడం విశేషం. ఇక అదే విధంగా మహేష్ రీసెంట్ రిలీజ్ బ్రహ్మోత్సవం దెబ్బకి కూడా పంపిణీదారులు బాగా నష్టపోయే అవకాశం ఉందట.


అందుకే ఊపిరి సినిమా దర్శకుడితో పివిపి బ్యానర్లో పరం వి పొట్లూరి ఓ సినిమా నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. బ్రహ్మోత్సవంకు లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్స్ కు ఈ సినిమా తక్కువ అమౌంట్ కే ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట నిర్మాత పివిపి. అయితే మహేష్ తో వంశీ సినిమా అంటే ఇప్పడప్పుడే కార్యరూపం దాల్చే అవకాశం లేదు.


ఎందుకంటే మహేష్ ఇప్పటికే మురుగదాస్ సినిమా కమిట్ అయ్యాడు. ఇక దాని తర్వాత ఉంటే త్రివిక్రం శ్రీనివాస్ తో కాని పూరి జగన్నాథ్ తో కాని ఉండే అవకాశం ఉంది. మరి వీరిద్దరిని కాదని మహేష్ ముందు వంశీ పడిపల్లితో చేసే అవకాశం ఏమన్నా ఉందేమో చూడాలి. బ్రహ్మోత్సవం సినిమా టాక్ ఘోరంగా ఉంది. సినిమా కలక్షన్స్ పరంగా బాగానే ఉన్న బ్యాడ్ మౌత్ టాక్ తో సినిమా మహేష్ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ గా అభివర్ణిస్తున్నారు.


మరి పివిపి ఇదే కాకుండా భారీ లాస్ అయిన పంపిణీదారులకు లాస్ లో 50 శాతం వరకు తిరిగి ఇచ్చే ఆలోచన చేస్తున్నాడట. మరి ఈ రెండిటిలో డిస్ట్రిబ్యూటర్లు దేనికి ఓకే అంటారో చూడాలి. మొత్తానికి స్టార్ హీరోల సినిమాల డిస్ట్రిబ్యూటర్లు నష్టనివారణ చర్యలకు నడుం బిగించడం మెచ్చుకోదగ్గ విషయమేనని చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: