ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం నటించిన చిత్రం బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం మూవీ కారణంగా మహేష్ బాబు ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు. తను ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని తన తరువాత మూవీపై అప్లై చేస్తున్నాడు. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, బ్రహ్మోత్సవం మూవీపై మహేష్ బాబు భారీ పెట్టుబడులను పెట్టాడు. దీంతో సినీ నిర్మాణం విషయంలో ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సి వచ్చింది.

ఇక ప్రమోషన్స్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. గతంలో తను ఏ మూవీలో డైరెక్ట్ ఇన్వెస్ట్ మేంట్స్ చేయకపోవటంతో…కేవలం నటించేసి పక్కకు వచ్చేవాడు. ఇప్పుడు అలా కాదు…పెట్టుబడులను తను కూడ పెట్టడంతో ప్రొడక్షన్ కంట్రోల్ ను నేరుగా పరిశీలించుకోవాల్సిన పరస్థితి వచ్చింది. ప్రమోషన్స్ లోనూ ఇప్పుడు అన్నీ ఛానల్స్ ని కలుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇది బ్రహ్మోత్సవం మూవీ కోసం మహేష్ తీసుకున్న బాధ్య‌త‌లు.

ఇది కొంత మహేష్ కి ఇబ్బందిని కలుగచేసింది. బ్రహ్మోత్సవం మూవీకి మహేష్ నార్మల్ గానే ప్రబ్లిసిటీని ఇచ్చినప్పటికీ…దీనిపై నెగిటివ్ పబ్లిసిటి ఎక్కువైంది. దీంతో ఈసారి మాత్రం తన అప్ కమింగ్ మూవీలో భారీ పెట్టుబడులను పెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ మూవీలో పని చేయటానికి రెడీ అవుతున్న మహేష్ బాబు…ఈ మూవీలో తన ఇన్వెస్ట్ మెంట్ రోల్ ని తగ్గించుకున్నాడు.

గతంలో ఈ మూవీకి తనే కో ప్రొడ్యూసర్ గా ఉంటూ దాదాపు 49 శాతం పెట్టుబడులను పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆ షేర్ ని తగ్గించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా బ్రహ్మోత్సవం ఎఫెక్ట్ అని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: