టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలన రికార్డ్స్ ని క్రియేట్ చేసిన బాహుబలి, ఇప్పుడు బాహుబలి సీక్వెల్ కి రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు 70 శాతంని పూర్తి చేసుకుంది. ఇంకా కొన్ని కీలక సన్నివేశాలకి సంబంధించిన సీన్స్ మిగిలే  ఉన్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు బాహుబలి2కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ సైతం శరవైగంగా పనులను జరుపుకుంటుంది. అయితే బాహుబలి వచ్చిన తరువాత, బాహుబలి2కి వస్తున్న ఈ గ్యాప్ లో ఎంత మంది బాహుబలి2  కోసం ఆసక్తి చూపుతున్నారు? అంటూ ఓ సర్వే జరిగింది.


ప్రవైట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ జరిపిన ఈ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. బాహుబలి మూవీలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే క్యూరిసిటినీ అందరిలోనూ ఉంచాడు రాజమౌళి. అయితే ఇది బాహుబలి2 ఫిల్మ్ పై భారీ క్రేజ్ ని తీసుకువస్తుందని రాజమౌళి భావించాడు. కానీ ఇక్కడ జరుగుతుందేమింటంటే…అందరూ దీన్ని ఓ ఫన్ ఎలిమెంట్ కిందే భావిస్తున్నారు.


అంతేకానీ, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకునేందుకు ఉద్ధేశం కానీ, బాహుబలి2ని చూసే ఉద్దేశం కానీ లేదని చెప్పుకువచ్చారు. దీంతో బాహుబలి2 పై ప్రేక్షకుల్లో కొంత క్రేజ్ తగ్గించదని అంటున్నారు. బాహుబలి మూవీని ఏ విధంగా రిలీజ్  చేశారో..అదే హైప్ తో బాహుబలి2ని రిలీజ్ చేస్తే అంతగా ఉపయోగం లేదని అంటున్నారు.


బాహుబలి2కి ప్రత్యేకమైన పబ్లిసిటి అవసరం అంటూ ఆ సర్వే చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రేక్షకులు బాహుబలి2లోని ప్రత్యేకతలను తెలుసుకోవాలని ఉందట. సీక్వెల్ లో ప్రత్యేకతలు ఏమి లేకపోతే…వారు థియోటర్స్ వచ్చి చూడాలనుకునే పాయింట్ ఏమి లేదని ముందుగానే డిసైడ్ అవుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: