ఈమధ్య ఒక ప్రముఖ ఛానల్ మహేష్ తో చేసిన ఇంటర్వ్యూలో మహేష్ ఇప్పటి వరకు బయట పెట్టని ఎన్నో విషయాలను షేర్ చేసి ఆ ఇంటర్వ్యూ చూస్తున్న వారికి షాక్ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూను నిర్వహిస్తున్న యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ తన నటన పై తానే 1-100 మధ్య రేటింగ్ ఇచ్చుకోవలసిన పరిస్థుతులు ఏర్పడితే తాను 100వ స్థానాన్ని ఎంచుకుంటానని దీనివల్ల తనకు ఎటువంటి టెన్షన్ ఉండదు అని అంటూ తన పై తానే సెటైర్ వేసుకున్నాడు మహేష్. 

అదేవిధంగా సినిమా టైటిల్స్ లో ‘సూపర్ స్టార్ మహేష్’ అని వేయడం తనకు నచ్చదని అంటూ తన అభిమానుల కోసం తన సినిమాల నిర్మాతలు అలా వేస్తున్నారు అంటూ సెటైర్లు వేసాడు మహేష్. ఇన్ని సూపర్ హిట్ సినిమాలలో నటించాక కూడ తాను షూటింగ్ కు వెళ్ళే సమయంలో ప్రతిరోజు తొలి సినిమాలాగే భావించి భయంభయంగా సెట్లోకి అడుగుపెడుతుంటానని దర్శకుల్ని మెప్పించగలనో లేదో అని టెన్షన్ పడుతుంటానని అంటూ మహేష్ నటన పట్ల తనకు ఉన్న శ్రద్ధను తెలియ చేసాడు. 

ఇదే సందర్భంలో ఆ ఇంటర్వ్యూను నిర్వహిస్తున్న యాంకర్ మహేష్ ను మైథలాజికల్ సినిమాలలో నటిస్తారా ? అని అడిగినప్పుడు అలా తనను చూపెట్టాలి అంటే ఒక్క రాజమౌళికే సాధ్యం అని అంటూ రాజమౌళితో సినిమా చేయాలి అన్న కోరికను మరొకసారి వ్యక్త పరిచాడు మహేష్.  ఇక తన చిన్నతనం రోజుల గురించి గుర్తుకు చేసుకుంటూ చెన్నైలో తాను సినిమాలు చూడటానికి తన వద్ద డబ్బులు లేకపోతే తన అక్క పరుసులో డబ్బులు దొంగతనం చేసి సినిమా టిక్కెట్లను బ్లాక్ లో కొనుక్కుని చూసిన సందర్భాలను బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు మహేష్. 

తనను తన తండ్రి ఒక సూపర్ స్టార్ కొడుకుగా కాకుండా సామాన్యమైన వ్యక్తిగా పెంచిన సందర్భాలను గుర్తుకు చేసుకున్నాడు మహేష్. అయితే మహేష్ అభిమానులు మాత్రం ఏకంగా తమ ప్రిన్స్ నటన విషయంలో తనకు తానే 100వ స్థానం రేటింగ్ ఇచ్చుకోవడం మహేష్ అభిమానులకు షాక్ ఇచ్చింది..


మరింత సమాచారం తెలుసుకోండి: