సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్స్ లో సమంత ఒకరు. అలాగే భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లోనూ సమంత మొదటిస్థానంలో ఉన్నారు. తను ఒక్కో మూవీకి దాదాపు కోటి రూపాయల ప్యాకేజ్ ని తీసుకుంటుంది. గతంలో టాప్ హీరోయిన్స్ కి 60 లక్షల ప్యాకేజ్ ని ఇవ్వటమే గొప్ప అని నిర్మాతలు భావించేవారు. ఇప్పుడు ఆ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. టాప్ హీరోయిన్స్ అయితే కోటి రూపాయలు నుండి కోటిన్నర వరకూ ప్యాకేజ్ లు అందుబాటులో ఉన్నాయి.


కొన్ని సందర్భాల్లో రెండు కోట్ల రూపాయల వరకూ రెమ్యునరేషన్ ని సైతం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో సమంత కనీసం కోటిరూపాయలకి తగ్గకుండా రెమ్యునరేషన్ ని తీసుకుంటుంది. అయితే ఓ మూవీ విషయంలో మాత్రం తను కేవలం 50 లక్షలకే చేస్తానంటూ చెప్పుకొచ్చింది.కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాలు ఎక్కువుగా తీస్తుంటారు. అలాగే ప్రేక్షకులు సైతం అటువంటి చిత్రాలకి ఆధరణ మంచిగానే చూపిస్తుంటారు.


అందుకే టాప్ హీరోలు సైతం ఒక్కోసారి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాలని కోరుకుంటారు. అటువంటి సమయంలో వారు రెమ్యునరేషన్ ని తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా సమంత సైతం ఓ ప్రయోగాత్మక కథలో నటించేందుకు రెడీ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వాటి వివరాలను చూస్తే…కోలీవుడ్ కి చెందిన కొత్త డైరెక్టర్ సమంతకి ఓ కథని చెప్పాడంట. 


అందుకు నిర్మాతని కూడ తను రెడీ చేసుకున్నారు. కథ బాగానచ్ఛటంతో వెంటనే ఒప్పేసుకుంది. అందులోనూ తక్కవ కాల్షీట్స్ తోనే సినిమా పూర్తవ్వటం సమంతకి బాగా నచ్చింది. తను తీసుకుంటున్న రెమ్యునరేషన్ లో సగం కంటే తక్కువవే ఈ సినిమాని చేస్తానని డైరెక్టర్ కి సైతం మాట ఇచ్చిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: