ప్రిన్స్ మహేష్ బాబు ఏదైనా మూవీలో నటిస్తే…సరిగ్గా ఆ మూవీ రిలీజ్ సమయంలో కనీసం రెండు కొత్త బ్రాండ్స్ అయిన తన ఖాతాలోకి చేరతాయి. ఎందుకంటే మహేష్ కొత్త మూవీ అంటే కోట్లలల్లోని తన అభిమానులకి అది పండుగ వాతావరణం. అటువంటి సమయంలో మహేష్ బాబుని వారి ప్రొడక్ట్స్ కి ఉపయోగించుకుంటే జరిగే రీచింగ్ ట్రెమండస్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే…ఇప్పుడు తను నటించిన బ్రహ్మోత్సవం మూవీ విషయంలోనూ ఇదే జరిగింది.


బ్రహ్మోత్సవం మూవీ రిలీజ్ సమమంలో మహేష్ బాబు రెండు కొత్త బ్రాండ్స్ కి సైన్ చేశారు. ఒకటి నేషనల్ యాడ్ అయితే…రెండోది స్టేట్ కి సంబంధించినది. రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వెంచర్ కి మహేష్ బాబు తొలిసారిగా బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు. ఇందు కోసం ఆ సంస్థ, మహేష్ కి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ యాడ్ ని రెడీ చేయించింది. ఈ యాడ్ కి డైరెక్టర్ మెహర్ రమేష్ డైరెక్టర్ గా ఉన్నారు.


రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రాముఖ్యతని చెబుతూ సాగే ఈ యాడ్…చాలా స్టైలిష్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు బ్రహ్మోత్సవం మూవీ పూర్తికి నెగిటివ్ రిపోర్ట్స్ బయటకు రావటంతో….మహేష్ పై కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రియల్ ఎస్టేట్ యాడ్ నిరుపయోగంగా మారింది.


బ్రహ్మోత్సవం సినిమా సక్సెస్ ని క్యాష్ చేసుకుందామని అనుకున్న ఆ రియల్ ఎస్టేట్ వారు…ఇప్పుడు మహేష్ తో చేయించిన యాడ్ ని ఏ టీవి ఛానల్స్ వారికి ఇవ్వటం లేదు. దీంతో ఇది వారికి కొంత నష్టాన్నిచేకూర్చిందని ఇతర రియల్ ఎస్టేట్స్ అడ్వైజర్స్ అంటున్నారు. మొత్తంగా బ్రహ్మోత్సవం ఎఫెక్ట్ కాస్త…రియల్ ఎస్టేట్ పైనా పడిందనే టాక్స్ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: