తెలుగు ఇండస్ట్రీలో పునాధిరాళ్లు చిత్రంతో పునాది వేసిన చిరంజీవి స్వయంకృషితో పైకి వచ్చారని అందరికీ తెలుసు. అయితే అప్పట్లో అగ్ర హీరోలతో పోటీ పడుతూ తనకంటూ ఓ ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ ఏర్పాటు చేసుకొని  మెగా స్టార్ అయ్యారు. ఒకప్పుడు ఎన్టీఆర్,ఏఎన్ఆర్ లకు ఉన్న రేంజ్ ఒక్క చిరంజీవికే ఉందనే విషయంలో అతిశయోక్తి లేదు. ఇక చిరంజీవి హీరోగా మంచి ఫామ్ లో ఉండగా రాజకీయాల్లోకి వెళ్లారు. తర్వాత ఆయన తమ్ముడు పవన్ కళ్యాన్ హీరోగా ఎంట్రీ ఇచ్చి కొత్తలో కాస్త తడబడ్డా తమ్ముడు,ఖుషి, జల్సా,గబ్బర్ సింగ్ లాంటి సినిమాలో ఒక్కసారే స్టార్ ఇమేజ్ పెంచుకొని ఇప్పడు పవర్ స్టార్ గా అందరి అభిమానం సొంతం చేసుకున్నారు.  మెగా   వృక్షానికి మొదలు చిరంజీవి..అందుకే ఆయనంటే మెగా హీరోలకు మంచి అభిమానం.

మెగా హీరోలు


ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు పవన్ కళ్యాన్,అల్లు అర్జున్,రాంచరణ్,వరుణ్ తేజ,సాయిధరమ్ తేజ్ ఎవ్వరి టాలెంట్ వారికి ఉన్నా..వాళ్ల బ్యాగ్ గ్రౌండ్ మాత్రం చిరంజీవి అని అందరికీ తెలుసు.  ఈ మద్య సరైనోడు బ్లాక్ బ్లస్టర్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ మాట్లాడుతున్న సమయంలో కొంతమంది పవర్ స్టార్ గురించి మాట్లామంటే చెప్పను బ్రదర్ అంటూ వెళ్ళిపోయాడు. అది కాస్త పెద్ద దుమారం చెలరేగింది..సోషల్ మీడియాలో సంచలన వార్తలు రావడంతో మెగా ఫ్యాన్స్ మద్య గొడవలు మొదలయ్యాయి. అందే కాదు ఈ విషయం చిరంజీవి దాకా వెళ్లడం బన్నికీ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.

మెగా బ్రదర్స్ చిరంజీవి,నాగబాబు, పవన్ కళ్యాన్


తర్వాత ‘ఒక మనసు’ ఆడియో వేడుకలో బన్నీ పవర్ స్టార్ గురించి మాట్లాడకపోవడం కారణం ఫ్యాన్స్ అని అయితే అందరిలా పవన్ గురించి తనకు మెకానికల్ గా మాట్లాడటం చేతకాదని వాస్తవానికి ఆయన గురించి ఫ్యాన్స్ తో ప్రత్యేకంగా మాట్లాడతానని అన్నారు. అంతే కాదు మెగా  వృక్షానికి మొదలు లాంటి చిరంజీవిని కొన్నేళ్లుగా మెగా అభిమానులు లైట్ తీసుకుంటున్నారు. పవన్ కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. కనీసం చిరు మైక్ పట్టుకుని స్వేచ్చగా మాట్లాడే పరిస్థితి లేదు. ఈ విషయంలో బన్నీ చాలా హర్ట్ అయ్యాడట.

పవన్ కళ్యాన్ గురించి మాట్లాడుతున్న అల్లు అర్జున్


చిరంజీవి అంతటి వారే ఏదో విషయం మాట్లాడనుకుంటే ఆయన ముందే పవర్ స్టార్ అనడం ఆయన మనసు గాయపరిచే విధంగా ఉందని మెగా హీరోలు చిత్రపరిశ్రమలో ఉన్నారంటే ఆయన చలువే అని అలాంటి వ్యక్తి మాట్లాడే సమయంలో ఫ్యాన్స్ అల్లరి తో చిరంజీవి ఏమీ మాట్లాడలేని పరిస్థితి తయారైందని బన్ని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా చిరు ఇప్పుడు 150వ సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడైనా అభిమానుల్లో ఉన్న చిరు పాత ఇమేజ్ బయటకు రావాలి. కాబట్టి పవన్ టాపిక్ కాస్త డైవట్ చేస్తే మంచిది అని బన్నీ భావించాడు.  అంతేగాని పవన్ తో అతనికెలాంటి వివాదాలు లేవు. కానీ ఆ విషయం  కాస్త మిస్ ఫైర్ అయి నానా గందరగోళం నెలకొంది. మొత్తానికి మేనమామ గురించి బన్నీ తీసుకున్న తీసుకున్న నిర్ణయంలో న్యాయం లేకపోలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: