తెలుగు ఇండస్ట్రీలో ఇప్పడు అగ్ర హీరోలుగా చెలామణి అవుతున్నవారంతా వారసత్వపు హీరోలు మాత్రంమే..అయితే వీరితో పోటీగా యువ హీరోలు వస్తున్నప్పటికీ వారి రేంజ్ వేరే ఉంటుంది. ఇక సినీ బ్యాగ్ గ్రౌండ్ ఏమాత్రం లేని ఒక మూమూలు వ్యక్తి సోషల్ మీడియాతో ముఖ్యంగా రాజమౌళి ఒక్క ట్విట్ తో ఒక్కసారిగా పాపులర్ ఫిగర్ అయ్యారు..ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా..! ‘హృదయకాలేయం’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో ప్రకంపనాలు సృష్టించిన కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు. ఈ చిత్రం రిలీజ్ కి ఆరు నెలల ముందు నుంచి రక రకాల ఫోటోలు..టీజర్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాడు. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో కొత్త కామెడీ హీరోగా సెట్ అయ్యాడు. తర్వాత వచ్మచిన ‘సింగం 123’ పేరడీ చిత్రంతో మరికొన్ని మార్కులు కొట్టేశాడు.

కొబ్బరిమట్ట పోస్టర్


కేవలం హీరోగానే కాకుండా క్యారెక్టర్ పాత్రలు వేస్తూ తనకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకున్నాడు. తాజాగా సంపూర్ణేష్ బాబు నటించిన ‘కొబ్బరి మట్ట’ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రంలో పెదరాయుడ, పాపారాయుడు, ఆండ్రాయిడ్ అనే పాత్రల్లో నటించి మెప్పించబోతున్నాడట. ఈ చిత్రం తాలూకూ టీజర్ కూడా అద్భుతమైన పంచ్ డైలాగ్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తాజాగా సంపూర్ణేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన కామెంట్ చేశాడు..కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయ్యింది.


ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్ ’ ఫస్ట్ లుక్ పోస్టర్


ఈ పోస్టర్ పై సంపూ కామెంట్ ఈ విధంగా చేశాడు ..''సైడ్ యాంగిల్ లో ఉన్నాడు ..... సైడ్ అయిపోతాడేమో అనుకున్నారేమో , నేరుగా ఫేస్ చేసే దమ్ము నీకోచ్చినప్పుడు విశ్వరూపమే '' అంటూ కామెంట్ చేసి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఎంత ఫోర్స్ గా ఉందో చెప్పకనే చెప్పాడు ,ఎన్టీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత , నిత్యా మీనన్ లు నటిస్తుండగా కీలక పాత్రలో మోహన్ లాల్ నటిస్తున్నాడు . ఈ చిత్రాన్ని ఆగష్టు 12 న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు 



మరింత సమాచారం తెలుసుకోండి: