టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు జాతీయ మీడియాకు చెందిన ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక క్షమార్పణలు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.  ‘బ్రహ్మోత్సవం’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో 'ఫ్లాపోత్సవం' పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని, సెటైర్లను ఒక కూర్పుగా చేస్తూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రచురించిన కథనం పెను సంచల నాలు  సృష్టించడంతో మహేష్ బాబు అభిమానులు భగ్గుమన్నారు.  

అంతేకాదు సోషల్ మీడియాలో ఎవరో ఆకతాయిలు చేస్తున్న దుష్పచారన్ని ఇలా ప్రింటు మీడియాలో కథనంగా వేయడం ఏమిటంటూ ప్యాన్స్ అంతా కలిసి హైదరాబాద్ లోని పత్రిక ఆఫీసు కార్యాలయం పై దండెతి వెళ్లారు. ఈ విషయం చిలికి చిలికి సుడిగాలిలా మారడంతో ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక యాజమాన్యం నష్ట నివారణ చర్యలు చేప్పట్టి మహేష్ బాబు అభిమాన సంఘాల ముఖ్య నాయకులతో  చర్చలు జరిపింది.

ఈ పత్రికకు సంబంధించిన బుధవారం నాటి సంచికలో ప్రధాన పేజీలో ‘క్షమార్పణలు’ తో కూడిన వార్తను కూడా ప్రచురితం చేస్తామని అభిమాన సంఘం నాయకులకు ఆ పత్రిక యాజమాన్యం మాట ఇవ్వడంతో  మహేష్ అభిమానులు శాంతించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చర్చల అనంతరం మహేష్  ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ ఒకప్పుడు సూపర్ స్టార్ క్రిష్ణ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగేవి ఇపుడు ఆ పరిస్థితులు పోయాయి. ఇప్పుడు అందరు హీరోల ఫ్యాన్స్ మంచి యాటిట్యూడ్ తో ఉంటున్నారు అని అంటూ ఎవరో ఆకతాయిలు కావాలని ఇలాంటివి చేస్తున్నారు అని చెపుతూ  అలాంటి వారు చేస్తున్న ప్రచారాన్ని ఒక ప్రముఖ దిన పత్రిక  ప్రధానంగా ప్రస్తావించడం, సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి నెగిటివ్ గా వ్రాయడం  బాధాకరం అన్నారు. 

మహేష్ బాబును చూసి జెలసీ ఫీలవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోవడంతో ఇంటువంటి నెగిటివ్ కామెంట్స్ పెరిగి పోయి ఉంటాయని మహేష్ అభిమాన సంఘాల నాయకులూ అభిప్రాయ పడ్డారు. మొత్తo మీద మహేష్ ను టార్గెట్ చేస్తూ రాసిన ఒక ఆర్టికల్ విషయ మై తిరిగి ఆ  మీడియా సంస్థనే ప్రశ్నించే విధంగా పరిస్థితులు ఏర్పడటంతో పాటు తిరిగి అదే పత్రిక క్షమార్పణ చెపుతూ మరో న్యూస్ రాయడం మహేష్ స్టామినాను సూచిస్తోంది అంటూ మహేష్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: